రెండేళ్ల పాలనలో హామీల అమలేది..?
సిరిసిల్లటౌన్: దేశ స్వాతంత్య్రోద్యమంలో పోరాడిన ఏకై క సంఘం ఏఐఎస్‌ఎఫ్ అని రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. సంఘం జిల్లా మహాసభలు మంగళవారం సిరిసిల్లలో నిర్వహించగా ఆయన మాట్లాడారు. దేశంలో విద్యార్థుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్న చరిత్ర ఏఐఎస్‌ఎఫ్‌కు ఉందన్నారు. మోదీ ప్రభుత్వం మతం పేరుతో రా జకీయం చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగా టం ఆడుతుందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనలో విద్యార్థులకు ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. అ లాగే విద్యార్థులు పట్టణంలోని బస్టాండ్ చౌరస్తా నుంచి వస్త్ర వ్యాపార సంఘం భవన్ వరకు ర్యాలీ తీశారు. అనంతరం జెండాను జిల్లా అధ్యక్షుడు రాకేశ్ ఆవిష్కరించి సభకు అధ్యక్షత వహించారు. సీపీఐ కార్యదర్శి మంద సుదర్శన్, ఏఐ టీయూసీ జిల్లా కార్యదర్శి రాములు, కండె విజేత, జిల్లా అధ్యక్ష, కార్యదర్శి కుర్ర రాకేశ్, మంద అనిల్, అధిత్య, ముద్రకోల శశికుమార్, బండారి చందు, బండి ప్రణయ్, వంశీ, శ్రీహరి, శివసాయి పాల్గొన్నారు.


