తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ
సిరిసిల్లటౌన్: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియాగాంధీ నెరవేర్చిందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలను గాంధీచౌక్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండేళ్ల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తుందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, గోలి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. విలీన గ్రామాల్లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు.


