రేపు 76 గ్రామాలు.. 521 వార్డుల్లో ఎన్నికలు
సిరిసిల్ల: జిల్లాలోని చందుర్తి, కోనరావుపేట, రుద్రంగి, వేములవాడఅర్బన్, వేములవాడ రూరల్ మండలాల్లో 76 గ్రామాల్లో 521 వార్డుల్లో గురువారం(11వ తేదీ) ఎన్నికలు జరుగనున్నాయి. చందుర్తి మండలంలో 13,445 మంది పురుషులు, 14,649 మహిళలు, కోనరావుపేట పరిధిలో 17,180 మంది పురుషులు, 18,045 మహిళలు, రుద్రంగి మండలంలో 6,454 మంది పురుషులు, 7,208 మహిళలు, ఇతరులు 3, వేములవాడఅర్బన్ మండలంలో 8,953 మంది పురుషులు, 9,523 మహిళలు, ఇతరులు 16, వేములవాడ రూరల్ మండలంలో 9,020 మంది పురుషులు, 9,805 మహిళా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల విధుల్లో 898 మంది పీవోలు, 1,135 మంది ఓపీవోలు ఉంటారు.
వీర్నపల్లి: మండలంలోని భూక్యతండా పంచాయతీలో సర్పంచ్ పదవికి 8 మంది నామినేషన్ వేయగా, గ్రామ పెద్దలు, గిరిజన యువకులు ఏకగ్రీవానికి కృషి చేశారు. వారి పిలుపుతో ఆరుగురు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మరో అభ్యర్థి ఉపసంహరణకు సిద్ధమైనా మూడు నిమిషాలు ఆలస్యం కావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నామినేషన్ ఉపసంహరణను అంగీకరించలేదు. దీంతో తండాలో పోటీ తప్పలేదు. మరో వైపు 8మంది వార్డుమెంబర్ స్థానాలు ఏకగ్రీవంగా ఖరారయ్యాయి.


