మేలుకొలుపు!
న్యూస్‌రీల్
ఓటు అమ్ముకోవద్దంటూ పిలుపు
మద్యం, మనీకి ఆశపడితే ఐదేళ్లు శూన్యమేనని ప్రచారం
ర్యాలీలు, సోషల్‌మీడియాలో అవగాహన
పంచాయతీ ఎన్నికల్లో కీలకంగా యువత
జిల్లాలో 62,178 మంది యువ ఓటర్లు
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
యువతరం
కరపత్రాలు పట్టుకొని ఉన్న వీరు ఎల్లారెడ్డిపేట మండలం సింగారం యువకులు. ఓటర్లు తమ ఓటును డబ్బు, మద్యానికి అమ్ముకోవద్దంటూ రెండు రోజులుగా ర్యాలీ తీస్తున్నారు. దాదాపు 30 మంది యువకులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓట్లు అమ్ముకోవద్దంటూ చైతన్యవంతులను చేస్తున్నారు. సర్పంచ్, వార్డుసభ్యులలో ఎవరు పనిచేస్తారో.. ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నారు. బుద్ధిజీవులు ప్రశ్నించి పనులు చేయించుకోవాలని సూచిస్తున్నారు. సింగారం గ్రామ యువతను
ఆదర్శంగా తీసుకొని జిల్లాలోని పలు గ్రామాల్లోనూ యువకులు ఇదే బాటలో నడుస్తున్నారు. గ్రామానికి ఏం చేస్తారని అభ్యర్థులను నిలదీస్తున్నారు..
సింగారంలో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్న యువకులు
ముస్తాబాద్(సిరిసిల్ల): పల్లెపోరులో యువతరం కీలకంగా మారనుంది. ఓటర్లుగా నమోదుకావడమే కాదు.. బరిలో నిలుస్తామంటూ ముందుకొస్తున్నారు. మరికొంత మంది యువత సామాజిక బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటున్నారు. ఓటును మద్యం, మనీ కోసం అమ్ముకోవద్దని.. నిజాయితీగా ఓటేసి పనిచేయించుకుందామని అవగాహన కల్పిస్తున్నారు. ఓటును అమ్ముకుంటే పనిచేయించుకోలేమని.. అప్రమత్తంగా ఉండాలంటూ గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.
260 గ్రామాలు.. 62,178 యువ ఓటర్లు
జిల్లాలో 260 గ్రామాల్లో 1,75,772 పురుషులు, 1,82,559 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 20 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. వీరిలో 18 నుంచి 25 ఏళ్లలోపు వారు 62,178 మంది ఉన్నారు.
ప్రశ్నించేతత్వం పెంపు
చదువుకున్న యువతలో కొందరు సోషల్‌మీడియా వేదికగా, మరికొందరు ప్రత్యక్షంగా గ్రామాల్లోని ఓటర్లలో ప్రశ్నించేతత్వాన్ని పెంపొందిస్తున్నారు. మా ఓటు వేస్తాం.. గ్రామానికి మీరేం చేస్తారంటూ ప్రశ్నించేతత్వం ఇటీవల పెరిగింది. గ్రామాల్లో యువకులు ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో వేదికగా పల్లె ప్రజలను జాగరుకులను చేస్తున్నారు. ఒక్క ఓటు ఊరి తలరాతను మారుస్తుందంటున్నారు. ఊరి అభివృద్ధి కోసం విజన్ ఉన్న నాయకుడిని ఎన్నుకుందామంటూ అవగాహన కల్పిస్తున్నారు.
మేలుకొలుపు!
మేలుకొలుపు!
మేలుకొలుపు!
మేలుకొలుపు!


