బాధితులకు సత్వర న్యాయం | - | Sakshi
Sakshi News home page

బాధితులకు సత్వర న్యాయం

Dec 9 2025 7:02 AM | Updated on Dec 9 2025 7:02 AM

బాధిత

బాధితులకు సత్వర న్యాయం

బాధితులకు సత్వర న్యాయం ● ఎస్పీ మహేశ్‌ బీ గీతే రైతులు అధైర్య పడొద్దు ● జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌ బేగం బద్దిపోచమ్మ రాజగోపురాలకు భూమిపూజ ఎన్నికల విధులు సమర్థంగా నిర్వహించాలి అభ్యర్థుల ఖర్చుపై దృష్టి పెట్టండి

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

సిరిసిల్ల క్రైం: బాధితులకు సత్వరమే న్యాయం చేసేందుకు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్‌ బీ గీతే పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డే వివిధ సమస్యలపై 18 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. పోలీస్‌ సేవలను ప్రజ లకు చేరువ చేయడమే తమ లక్ష్యమన్నారు.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దని, రబీ సీజన్‌కు సరిపడ యూరియా అందుబాటులో ఉంచామని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌ బేగం పేర్కొన్నారు. మండలంలోని అల్మాస్‌పూర్‌లో యూరియా పంపిణీని సోమవారం పరిశీలించారు. ముందు జాగ్రత్తగా అన్ని మండలాల్లోనూ యూరియాను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. అనంతరం రాచర్లగొల్లపల్లి, బండలింగంపల్లి, వెంకటాపూర్‌, రాజన్నపేట, అల్మాస్‌పూర్‌లోని పోలింగ్‌కేంద్రాలను పరిశీలించారు. ఎంపీడీవో సత్తయ్య, మండల వ్యవసాయాధికారి రాజశేఖర్‌ ఉన్నారు.

కంట్రోల్‌ రూమ్‌ తనిఖీ

సిరిసిల్ల: కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌, మీడియా సెంటర్‌ను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవికుమార్‌ సోమవారం తనిఖీ చేశారు. మీడియా సెంటర్‌లో సంబంధిత రిజిస్టర్లు పరిశీలించారు. అనంతరం కంట్రోల్‌ రూమ్‌లో ఫిర్యాదుల రిజిస్టర్‌ పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు.

వేములవాడ: బద్దిపోచమ్మ ఆలయం రాజగోపురాల మార్కింగ్‌ పనులకు ఈవో రమాదేవి, రాష్ట్ర దేవాదాయశాఖ స్థపతి వల్లినాయగం, ఈఈఎస్‌ దుర్గాప్రసాద్‌ సోమవారం భూమిపూజ చేశారు. రాజగోపుర నిర్మాణానికి సంబంధించిన మార్కింగ్‌, నిర్మాణ పద్ధతులు, శిల్పకళా ప్రమాణాలపై అధికారులు సమీక్షించారు. ఆలయ ఈఈ రాజేశ్‌, డీఈ రఘునందన్‌ పాల్గొన్నారు.

కోనరావుపేట(వేములవాడ): ఎన్నికల విధులు సమర్థంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ సూచించారు. మండలకేంద్రంతోపాటు నిజామాబాద్‌లో పోలింగ్‌ కేంద్రాలను సోమవారం తనిఖీ చేశారు. కోనరావుపేట జూనియర్‌ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. తహసీల్‌ ఆఫీస్‌లో భూభారతి, సాదాబైనామా దరఖాస్తులపై ఆరా తీశారు. అనంతరం మల్కపేట, కోనరావుపేట, నిజామాబాద్‌ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తహసీల్దార్‌ వరలక్ష్మి, ఎస్సై ప్రశాంత్‌రెడ్డి, ఎంపీడీవో స్నిగ్ధ, ఏఈ అంజయ్య, కుమార్‌, ఆర్‌ఐ సంతోష్‌, ఎంపీవో ఆరిఫ్‌పాషా, కార్యదర్శి సాయి పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పెడుతున్న ఖర్చుపై అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా వ్యయ పరిశీలకులు రాజ్‌కుమార్‌ సూచించారు. మండల పరిషత్‌, వెంకటాపూర్‌ పంచాయతీలను సోమవారం తనిఖీ చేసిన సందర్భంగా అధికారులతో మాట్లాడారు. అభ్యర్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మండంలో ఎన్ని నామినేషన్లు వచ్చాయని, ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలుసుకున్నారు. నోడల్‌ అధికారి నవీన్‌, భారతి, ఎంపీడీవో సత్తయ్య ఉన్నారు.

బాధితులకు సత్వర న్యాయం
1
1/2

బాధితులకు సత్వర న్యాయం

బాధితులకు సత్వర న్యాయం
2
2/2

బాధితులకు సత్వర న్యాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement