ఓటర్లు 207.. బరిలో ముగ్గురు !
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలం చిన్న గ్రామపంచాయతీ పొన్నాలపల్లె. ఈ గ్రామంలో 102 మంది పురుషులు, 105 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయినా పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఐదేళ్ల క్రితం గ్రామపంచాయతీ ఏర్పడిన పొన్నాలపల్లెలో అప్పుడు ఏకగ్రీవంగానే ఎన్నికలు జరిగాయి. కానీ ఈసారి మాత్రం సర్పంచ్ స్థానానికి ముగ్గురు నామినేషన్లు వేశారు. నాలుగు వార్డు స్థానాల్లో రెండు ఏకగ్రీవం కానున్నాయి. మరో రెండు స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మరో విశేషమేమిటంటే.. ఈ గ్రామంలో అందరూ బీసీలే. అందులోనూ అందరూ మున్నూరుకాపులు.


