‘కవ్వంపల్లి’ని కలిసిన ఏకగ్రీవ సర్పంచులు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 8 మంది సర్పంచులలో ఏడుగురు సోమవారం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కలిశారు. ముస్కాన్‌పేట సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిప్పాపురం సర్పంచ్ బొల్లవేణి మంజుల, కేసన్నపల్లి సర్పంచ్ పోతరాజు చంటి, కృష్ణరావుపల్లి సర్పంచ్ జక్కుల మల్లవ్వ, గాలిపల్లి సర్పంచ్ బద్దం శేఖర్‌రెడ్డి, పత్తికుంటపల్లి సర్పంచ్ జుట్టు శేఖర్, జంగారెడ్డిపల్లి సర్పంచ్ పండుగ సునీత ఉన్నారు. ఏకగ్రీవ వార్డుమెంబర్లు, కాంగ్రెస్ నాయకులు గుడిసె ఐలయ్య, వెంకట రమణారెడ్డి, బాల్‌రెడ్డి, భాస్కరరావు, రమేశ్, రాజేందర్‌రెడ్డి ఉన్నారు.


