పల్లెల అభివృద్ధికి కాంగ్రెస్‌తో కలిసి రండి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: పల్లెల అభివృద్ధికి అధికార పార్టీ కాంగ్రెస్‌లో చేరి కలిసి పనిచేసేందుకు ముందుకురావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన పలువురు నాయకులు, ఇటీవల ఏకగీవ్రంగా ఎన్నికై న వార్డు సభ్యులు మహేశ్, సంపత్ మరో 25 మందితో కలిసి సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. వీరందరికి విప్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.


