రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సిరిసిల్ల అర్బన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు క్తి మృతి చెందిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణ పరిఽ దిలోని పెద్దూరు డబుల్ బెడ్‌రూమ్ కాలనీకి చెందిన అలిశెట్టి మహేశ్(40) వేములవాడలోని ఓ టెంట్ హౌస్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి పని ముగించుకొని సిరిసిల్ల బస్టాండ్‌లో బస్సు దిగి ఇంటికి నడుచుకు ంటూ వస్తున్నాడు. ఈక్రమంలో నే పెద్దూరు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల వద్ద గుర్తుతెలియని వాహ నం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య భవ్యశ్రీ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


