నిలిచిన రిజిస్ట్రేషన్లు
రామగుండం: మంచిముహూర్తం కావడం, తెల్లవారితో మూఢాలు ఆరంభం కానుండడంతో ఆస్తుల క్రయ, విక్రయదారులు, ఇతరత్రా అవసరాలు ఉన్నవారు బుధవారం పెద్ద ఎత్తున స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందే వీరు స్లాట్ బుక్‌చేసుకుని ఉన్నారు. అయితే, రిజిస్ట్రేషన్ కార్యాలయం తెరిచిన గంటలోపే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. రోడ్ల విస్తరణ కోసం చేపట్టిన తవ్వకాలతో వైర్లు తెగి ఇంటర్నెట్ సేవలు నిలిచినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు తెలిపారు. 17 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కోసం తమ వద్దకు వచ్చినట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. ఒక్కో డాక్యుమెంట్‌కు సుమారు ఐదురుగు తరలి రావడంతో కార్యాలయం కిటకిటలాడింది. ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్ తిరుపతినాయక్ డాక్యుమెంట్లు మాన్యువల్‌గా పరిశీలించారు. రాష్ట్రంలోని రామగుండం, భూపాలపల్లి, పటాన్‌చెరులో కొత్తగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. వీటికి ప్రత్యామ్నాయ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించలేదని తెలిసింది.
కానరాని వసతులు
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సిబ్బంది కోసం వాష్‌రూమ్స్ నిర్మించారు. క్రయ, విక్రయదారులకు ఆ సౌకర్యం ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో గంటల కొద్దీ నిరీక్షించిన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
శుభముహూర్తమని భారీగా తరలివచ్చిన జనం
కార్యాలయం ఎదుట నిరీక్షించిన క్రయ, విక్రయదారులు
సాంకేతిక సమస్యలే కారణమంటున్న అధికారులు
నిలిచిన రిజిస్ట్రేషన్లు
నిలిచిన రిజిస్ట్రేషన్లు


