భక్తుల మనోభావాలను కాపాడాలి
సిరిసిల్లటౌన్: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాలని వీటీడీఏ వైస్‌చైర్మన్, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆలయం పనుల్లో భాగంగా కోటిలింగాలను అక్కడి నుంచి మార్చే ప్రయత్నం చేస్తున్నారని, ఈవిషయంలో అన్నివర్గాల ప్రజలు హర్షించేలా పనులు చేపట్టాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. ఆలయ ప్రాంగణంలో ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయని, కోటిలింగాలను మార్చే ముందు వాటిని జరిపే విషయంలో కూడా చొరవ తీసుకోవాలని, అప్పటి వరకు కోటిలింగాలను జరపకుండా చూడాలని విన్నవించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు బండ మల్లేశం, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజురెడ్డి, జిల్లా కార్యదర్శి గొప్పడి సురేందర్రావు, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, వేణుగోపాలరావు, కోడె రమేశ్, మిర్యాల్‌కార్ బాలాజీ, రాపెల్లి శ్రీధర్, బూర్గుపల్లి పరమేశ్ పాల్గొన్నారు.


