బద్దిపోచమ్మకు బోనం | - | Sakshi
Sakshi News home page

బద్దిపోచమ్మకు బోనం

Oct 29 2025 9:41 AM | Updated on Oct 29 2025 9:41 AM

బద్ది

బద్దిపోచమ్మకు బోనం

వేములవాడ: ఎములాడ రాజన్న, భీమన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం వేకువజాము నుంచే బద్దిపోచమ్మకు బోనం మొక్కులు చెల్లించుకునేందుకు బారులుతీరారు. ఆలయ ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది.

సమయపాలన పాటించాలి

సిరిసిల్ల: జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది సమయపాలన పాటిస్తూ ఆరోగ్య పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని డీఎంహెచ్‌వో ఎస్‌.రజిత కోరారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో మంగళవారం మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్ల (ఎంఎల్‌హెచ్‌పీ)తో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఆరోగ్య ప థకాల లక్ష్యాలను సాధించాలన్నారు. జబ్బుల కు కారణాలను అన్వేషిస్తూ రక్త పరీక్షలు చే యాలని, వ్యాధిని నిర్ధారిస్తూ సేవలు అందించాలన్నారు. పీవోఎంహెచ్‌ఎన్‌ డాక్టర్‌ అంజలి, ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.

నాణ్యమైన సేవలందించాలి

కోనరావుపేట: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో రజిత అన్నారు. మంగళవారం మండలంలోని కొలనూర్‌లో ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ను తనిఖీ చేశారు. గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ జ్వరపీడితులను గుర్తించి వైద్య సేవలు అందించాలన్నారు. ఆమె వెంట ఏఎన్‌ఎం తిరుమల తదితరులున్నారు.

సద్దుమణిగిన వివాదం

వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని మద్దిమల్ల తండా గ్రామపంచాయతీలో మూడురోజుల నుంచి లొద్దితండా, మద్దిమల్ల తండావాసులు ధాన్యం కొనుగోలు స్థలం కోసం ఘర్షణలకు దిగారు. ఫారెస్ట్‌ అధికారులు, పోలీస్‌ సిబ్బంది నచ్చజెప్పినా వినలేదు. మంగళవారం జిల్లా ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీహరిప్రసాద్‌, తహసీల్దార్‌ ముక్తార్‌ పాషా, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లకావత్‌ రాములు, వైస్‌ చైర్మన్‌ లెంకల లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో రెండు తండాల పెద్దమనుషులతో మాట్లాడారు. అందరికీ ఉపయోగపడేలా ఊరుకు దగ్గరలో ఉన్న ఫారెస్ట్‌ భూమిలో తాత్కాలికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి వివాదం సద్దుమణిగేలా చేశారు. ఎస్సై లక్ష్మణ్‌, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ రంజిత్‌కుమార్‌, సక్కరాం, పద్మలత తదితరులు పాల్గొన్నారు.

ఇసుక ట్రాక్టర్ల అడ్డగింత

వేములవాడరూరల్‌: వేములవాడ రూరల్‌ మండలం మల్లారం గ్రామం నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. రెండురోజుల క్రితం తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చినా స్పందించకపోవడంతో పాటు మళ్లీ మంగళవారం అనుమతులు ఇవ్వడంతో ట్రాక్టర్లను అడ్డుకొని వాపస్‌ పంపించారు. ఇసుక ట్రాక్టర్లతో రోడ్లన్నీ దెబ్బతినడమే కాకుండా డ్రైవర్లు వేగంగా నడపడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నా రు. అలాగే గ్రామానికి దగ్గరగా ఇసుక తీస్తుండడంతో భూగర్భ జలాలు ఇంకిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చినా విచారణ చేయకుండా తిరిగి పర్మిషన్‌ ఇవ్వడంపై గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

అనుమతిలేకుండా డబ్బులు డ్రా?

వీర్నపల్లి(సిరిసిల్ల): మండల పరిషత్‌ కార్యాలయంలో గతంలో ఎంపీవో, ఎంపీడీవోగా విధులు నిర్వర్తించిన ఓ అధికారి అనుమతి లేకుండా రూ.లక్షల్లో డబ్బు డ్రా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విధులు నిర్వహిస్తున్న సందర్భంలో తన కుటుంబ సభ్యుల పేరు మీద కూడా డబ్బులు డ్రా చేశారని ఆరోపణలు వెల్లువెత్తడం మండలంలో చర్చనీయాంశమైంది.

బద్దిపోచమ్మకు బోనం
1
1/3

బద్దిపోచమ్మకు బోనం

బద్దిపోచమ్మకు బోనం
2
2/3

బద్దిపోచమ్మకు బోనం

బద్దిపోచమ్మకు బోనం
3
3/3

బద్దిపోచమ్మకు బోనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement