రోగులకు చిత్తశుద్ధితో సేవలందించాలి
● ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
సిరిసిల్ల: రోగులకు చిత్తశుద్ధితో వైద్యులు సేవలు అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంగళవారం సందర్శించారు. ముందుగా మెటర్నిటీ, ఆప్తమాలజీ, ఎమర్జెన్సీ వార్డులు, రక్త పరీక్షల ల్యాబ్‌ను పరిశీలించారు. వైద్య సేవలు పొందుతున్న వారితో మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
శిబిరానికి ఎందరు వచ్చారు?
దవాఖానాలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఆర్థోకి సంబంధించిన సదరం శిబిరం నిర్వహిస్తుండగా ఆమె పరిశీలించారు. శిబిరానికి వచ్చిన వారితో మాట్లాడి సౌకర్యాల తీరును ఆరా తీశారు. శిబిరానికి వచ్చేవారి కోసం మౌలిక వసతులు కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్య వసాయ ఉత్పత్తుల సేకరణపై మంగళవారం సా యంత్రం సమీక్షించారు. జిల్లాలో పత్తి కొనుగోలుకు 5 సీసీఐ కొనుగోలు కేంద్రాలను జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేశామని, ఆయా కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు సవ్యంగా చేయాలన్నారు. రెండు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా గోడ పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్, డీఆర్డీవో శేషాద్రి, వైద్యులు సంతోష్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, డీపీఎం రవీందర్, డీసీఎస్‌ఓ చంద్రప్రకాశ్, డీఏఓ అఫ్జల్ బేగం, డీసీఓ రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకాష్, మార్కెఫేడ్ అధికారి హబీబ్, డిప్యూటీ ఈఈ విజయ్‌శంకర్, ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.


