అన్ని వర్గాలను కలుపుకొని పోతాం
● ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసఫ్
వేములవాడఅర్బన్: రానున్న కాలంలో అన్ని వర్గాల కార్మికులను కలుపుకొని హక్కుల సాధనకు ముందుకెళ్తామని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసఫ్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని గుమ్మి పుల్లయ్య భవన్‌లో ఏఐటీయూసీ జిల్లా నాల్గో మహాసభ ఆదివారం నిర్వహించారు. ఈ సభకు కార్మికులు, రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యూసప్ హాజరైన సందర్భంగా మాట్లాడారు. ఏఐటీయూసీ కార్మికుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా అజ్జ వేణు, ప్రధాన కార్యదర్శిగా కడారి రాములు, ఉపాధ్యక్షుడు అనసూర్య, మల్లేశం, రవీందర్, కేతవ్వ, రాధ, కోశాధికారి శంకర్, సహాయ కార్యదర్శిగా లక్ష్మన్, పోశెట్టి, భూంరెడ్డి, భూదన్న, నర్సయ్య, కౌన్సిల్ సభ్యులుగా పోచమల్లు, దేవరాజు, రాజేశ్వరీ, దేవయ్య, రాములు, మమత, అంజలి ఉన్నారు.


