షెడ్ల తొలగింపు.. హుండీల తరలింపు
జేసీబీతో కొనసాగుతున్న పనులు
హుండీల తరలింపు
ప్రహరీ తొలగింపు
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా ఆదివారం గుడిలోని షెడ్లు, క్యూలైన్లను తొలగించారు. ఆలయ ఉత్తర గోపురం పక్కనే ప్రహరీని తొలగించారు. జేసీబీ సహాయంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఓ వైపు ఆలయ విస్తరణ పనులు కొనసాగుతుండగానే మరో వైపు రాజన్న దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. కార్తీకమాసం కావడంతో భారీగా భక్తులు రాజన్న దర్శనానికి వస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో పనులు చాలా జాగ్ర త్తగా చేయాల్సి వస్తుందని సిబ్బంది తెలిపారు. ఈనెల 24న హుండీ లెక్కింపు అనంతరం కొన్ని హుండీలను భీమన్నగుడిలోకి మార్చినట్లు తెలిసింది. ప్రధానాలయం, రాజగోపురం వద్దనున్న హుండీలను భక్తుల కోసం అక్కడే ఉంచారు.
షెడ్ల తొలగింపు.. హుండీల తరలింపు
షెడ్ల తొలగింపు.. హుండీల తరలింపు


