నేటి ప్రజావాణి రద్దు
సిరిసిల్ల: కలెక్టరేట్‌లో ఈ సోమవారం ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రకటించారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించే కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో మద్యం దుకాణాల టెండర్‌కు సంబంధించిన లక్కీ డ్రా తీయాల్సి ఉన్నందున రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్‌కు రావద్దని కోరారు.
జిల్లా మోడర్న్ కబడ్డీ కార్యవర్గం
సిరిసిల్లటౌన్: జిల్లా మోడర్న్ కబడ్డీ కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కుంభం రాంరెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్నారు. నూతన అధ్యక్షుడిగా నాంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తడకల సురేశ్, కోశాధికారి తడకల శ్యాంసుందర్, కార్యవర్గ సభ్యులుగా బండిపెల్లి పర్శరాములు, సందెల నరేశ్‌లను ఎన్నుకున్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
వేములవాడఅర్బన్: వేములవాడకు చెందిన ఉపాధ్యాయుడు పులి రామ్‌గోపాల్‌గౌడ్ కుమార్తె సనిషిత రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీలకు ఎంపికై ంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నిర్వహించినలో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్‌లో భాగంగా నిర్వహించిన 10 మీటర్ల ఎయిల్ ఫిస్టల్ షూటింగ్‌లో గోల్డ్ మోడల్ సాధించింది.
ప్రవీణ్‌కు రైతునేస్తం పురస్కారం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని చిన్నలింగాపూర్‌కు చెందిన కొడుముంజ ప్రవీణ్ రైతునేస్తం పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లోని స్వర్ణభారత్ ట్రస్టులో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. ప్రవీణ్ మాట్లాడుతూ మల్బరీ షూట్ హార్వెస్టింగ్ అండ్ బైండింగ్ మిషన్ తయారీని గుర్తించి పురస్కారం అందజేసినట్లు తెలిపారు.
సత్యం, ధర్మాలను బోధించేది భాగవతం
ముస్తాబాద్(సిరిసిల్ల): భాగవతంలో ధర్మం.. సత్య దర్శనం కలిగిస్తుందని బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ అన్నారు. ఎల్లారెడ్డిపేటలోని సత్సంగ సదనం 65వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం మహేశ్వరశర్మ ప్రవచనాలు వినిపించారు. శ్రీసరస్వతి గోవిందరాజుల చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, గుండం రాజిరెడ్డి, గంప నాగేంద్రం, అనంతరెడ్డి, సంజీవరెడ్డి, ద్యాప దేవయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.
నేడు భారీ వర్ష సూచన
సిరిసిల్ల: జిల్లాలో సోమవారం భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఆదివారం హెచ్చరించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు పడే జిల్లాల్లో రాజన్నసిరిసిల్ల ఉంది. జిల్లాలో పశువులు, గొర్రెలకాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.
నేటి ప్రజావాణి రద్దు
నేటి ప్రజావాణి రద్దు
నేటి ప్రజావాణి రద్దు
నేటి ప్రజావాణి రద్దు


