
చివరి రోజు.. దరఖాస్తుల జోరు
● రాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ ● 1324 టెండర్ ఫారాలు ● రాష్ట్ర ఖజనాకు రూ.39.72కోట్లు
సిరిసిల్లక్రైం: జిల్లాలో మద్యం దుకాణాల కోసం చివరి రోజు శనివారం దరఖాస్తులు జోరుగా పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 48 మద్యం దుకాణాలు ఉండగా శనివారం రాత్రి పది గంటలు దాటే వరకు 1324 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. గతంలో జరిగిన టెండర్లకు 2,036 దరఖాస్తులు ఆబ్కారీ శాఖ రాష్ట్ర ఖజానాకు రూ.40.72కోట్లు జమయ్యాయి. గతంలో ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షల ఫీజు ఉండగా, ప్రస్తుతం రూ.3లక్షలకు పెంచారు. ఈసారి రాష్ట్ర ఖజానాకు రూ.39.72కోట్లు సమకూరింది. గతంలో పోల్చితే దరఖాస్తులు తక్కువగా వచ్చినా.. ఆదాయంలో పెద్దగా తేడా లేదని అధికారులు చెబుతున్నారు. గతంతో పోల్చితే దాదాపు రూ.కోటి వరకు పడిపోయింది. దరఖాస్తులు మాత్రం 712 తగ్గాయి.