చందుర్తి(వేములవాడ): మండలంలోని అనంతపల్లికి ఆర్టీసీ సేవలు బుధవారం ప్రారంభమయ్యాయి. గత పన్నెండేళ్ల క్రితం ఆ గ్రామస్తులు ఆర్టీసీ సేవలకు దూరమయ్యారు. గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే కాలినడకనే మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి బస్సు ఎక్కాల్సిన పరిస్థితి. పన్నెండేళ్లుగా పలుమార్లు గ్రామానికి బస్సు సర్వీసు వేయాలని పాలకులు, అధికారులకు మొరపెట్టుకున్నారు. వారం క్రితం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు గ్రామస్తులు విన్నవించగా.. విప్ ఆదేశాలతో బస్సు సర్వీసు బుధవారం ప్రారంభమైంది. వేములవాడ నుంచి అనంతపల్లి మీదగా తిమ్మాపూర్ వరకు బస్సు నడిపిస్తున్నారు. ఈ ప్రా రంభోత్సవంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, రుద్రంగి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, వేములవాడ ఆర్టీసీ డిపో పీఆర్వో శ్రీనివాస్, గ్రామస్తులు తొట్ల మల్లేశం, చిన్న వెంకటేశం, కనకరాజు, రాజయ్య, మహేశ్, అనిల్ పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికలు
సిరిసిల్లకల్చరల్: ఓటు విలువ, ఎన్నికల నిర్వహణపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు కాలేజీల్లో నిర్వహిస్తున్న ఎన్నికలు దోహదపడతాయని సిరిసిల్ల టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం పోలింగ్ నిర్వహించారు. లెక్చరర్ చంద్రమౌళి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తూ హెడ్‌బాయ్స్, హెడ్‌గర్ల్స్ పదవుల కోసం ఎన్నికలు జరిపించారు. కాలేజీ ప్రెసిడెంట్‌గా జి.భావన, హెడ్ గర్ల్‌గా ఎన్.అక్షయ, హెడ్ బాయ్‌గా ఎ.సిద్ధార్థ ఎన్నికయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయరఘునందన్ పర్యవేక్షణలో లెక్చరర్లు కేదారేశ్వర్, వెంకటేశం, వివేకానంద, ఆంజనేయులు, చంద్రశేఖర్, కనకయ్య, రాజయ్య, సరోజన, శ్రీనివాస్, శశిధర్, రాజశేఖర్, శ్రీనివాస్, సుజిత, మమత, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి
సిరిసిల్ల: గర్భిణీలకు, బాలింతలకు, పిల్లల కు విధిగా ఆకుకూరలు, పండ్లు అందించా లని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం సూ చించారు. పోషణ మాసంలో భాగంగా జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం అవగాహన కల్పించారు. లక్ష్మీరాజం మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పోషణ మాసం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆహారంలో ఆయిల్, షుగర్ వాడకాన్ని తగ్గించాలని, పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. డీసీపీవో కవిత, సూపర్‌వైజర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
సిరిసిల్ల ఎడ్యుకేషన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్–14 విభాగంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎల్లారెడ్డిపేట కేజీబీవీ విద్యార్థిని వి.భార్గవి ఎంపికై ంది. ఉమ్మడి జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తుందని కేజీబీవీ స్పెషలాఫీసర్ అనిత, పీఈటీ శ్రీలత తెలిపారు.
అనంతపల్లికి ఆర్టీసీ సేవలు ప్రారంభం
అనంతపల్లికి ఆర్టీసీ సేవలు ప్రారంభం