
పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుల నియామకం
కొత్తగా పొలిటికల్ అఫైర్ కమిటీ జిల్లాలో పార్టీని పునర్‌నిర్మిస్తాం ఏఐసీసీ అబ్జర్వర్ మన్నె శ్రీనివాస్ సిరిసిల్ల, వేములవాడలో కార్యకర్తలతో సమావేశాలు
సిరిసిల్లటౌన్/వేములవాడ: పార్టీ జిల్లా అధ్యక్షుడు నుంచి మండల అధ్యక్షుల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని ఏఐసీసీ అబ్జర్వర్ మన్నె శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియపై బుధవారం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సిరిసిల్లలోని మల్లికార్జున ఫంక్షన్‌హాల్, వేములవాడలోని మహాలింగేశ్వర గార్డెన్స్‌లలో నిర్వహించిన సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సంఘటన్ అభియాన్‌లో భాగంగా జిల్లా అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియపై కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ముందస్తుగా కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నెల రోజుల్లోగా జిల్లా అధ్యక్షుడి ఎన్నిక పూర్తయ్యేలా చూస్తామన్నారు. జిల్లా స్థాయిలో కొత్తగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అధిష్టానం ఆదేశాలు ఆచరిస్తాం
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు పదవుల ఎన్నిక చేపడతామని ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలతో మమేకమై రాబోయే రోజుల్లో పటిష్ట నాయకత్వం పదవులు అధిష్టించేలా చూస్తామన్నారు. ఎన్నికల అబ్జర్వర్ల నివేదికను ఏఐసీసీకి పంపిస్తారని పేర్కొన్నారు. పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, వెల్ముల స్వరూప, సంగీతం శ్రీనివాస్, చిట్ల సత్యనారాయణ, కనిమేని చక్రధర్‌రెడ్డి, వైద్య శివప్రసాద్, కాముని వనిత, సూర దేవరాజు, కూస సత్యనారాయణ పాల్గొన్నారు.