
సిలిండర్‌పైనే భోజనం వండాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఇల్లంతకుంట(మానకొండూర్): సిలిండర్‌పైనే మధ్యాహ్న భోజనం వండాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. మంగళవారం మండలంలోని పెద్దలింగాపురం హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. పాఠశాల గ్రౌండ్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆస్పత్రి వార్డులు, ఫార్మసీలో అందుబాటులో ఉన్న మందులు, ఓపీ రిజిస్టర్లు పరిశీలించారు. ప్రసవాలు ఎక్కువ జరిగేలా చూడాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆయా కార్యక్రమాల్లో డాక్టర్ ప్రేమ్‌కుమార్, స్కూల్ హెచ్‌ఎం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లకల్చరల్: యూనియన్ బ్యాంక్ వారి గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి ప్రకటన జారీ అయింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మూడేళ్ల కాలానికి భర్తీ చేసే ఉద్యోగాల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు. అధ్యాపకులు 2, ఆఫీస్ అసిస్టెంట్లు 2 పోస్టులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా, అటెండెంట్ 1, వాచ్‌మన్ 1 పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు. ఆసక్తి, అర్హత గల వారు ఈ నెల 17 సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అవసరమైన పత్రాలను జతచేసి పూర్తి చేసిన దరఖాస్తు పత్రాలను గోపాల్‌నగర్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో సమర్పించాలని, మరిన్ని వివరాలకు 63018 90681 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.