
నిజాంపై సాదుల నంబయ్య పోరు
పెద్దపల్లిరూరల్: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పెద్దపల్లి ప్రాంతంలో సాగిన పోరాటంలో అనభేరి ప్రభాకర్‌రావు, గట్టెపల్లి మురళి లాంటి వారితో పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన సాదుల నంబయ్య (బుక్క నంబయ్య) చురుకుగా పాల్గొన్నారు. నిజాం రాజులకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయడంలో పోరాటపటిమ చూపిన నంబయ్యపై ఆనాటి పాలకు లు నజర్‌బంద్ కూడా ప్రకటించారు. అయినా ఽధైర్యంగా దేశభక్తిని పెంచేలా నాటకాలు, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేశారు. నిజాం పాలకులకు కొరకరాని కొ య్యగా మారారు. రజాకర్ల నుంచి ప్ర జలకు ఇబ్బందులు రాకుండా గ్రామరక్షక దళాలు ఏర్పాటు చే సి వాటిని పర్యవేక్షించారు. నిజాం పాలకుల చె రలోని భూములను పేదలకు పంచడంలో క్రియాశీలపాత్ర పోషించిన నంబయ్య.. తాను నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతాలకు తుది శ్వాస వరకు కట్టుబడి నిజాయతీ ఉన్న నంబయ్య ఈ ప్రాంత వాసులకు జ్ఞప్తికి తెచ్చుకుంటారు.