
పోరాట యోధుడు అమృత్‌లాల్
నిజాంను ఎదిరించిన వారి లో సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అమృత్‌లాల్ శుక్లా ప్ర ముఖుడు. 1950లో సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి సంచలనం సృష్టించిన వీరుడు. సాయుధ దళాలను వ్యూహాత్మకంగా నడిపిస్తూ మూడు రంగుల జాతీయ జెండాలను ప్రాబల్య గ్రామాల్లో ఎగుర వేసి దేశభక్తిని చాటుకున్నారు. శుక్లాను నిజాం పోలీసులు నిర్బంధించి 13 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. చంచల్‌గూడ జైలు నుంచి తరలిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో తప్పించుకున్నాడు. 1957లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 85 ఏళ్ల వయస్సులో 1991 నవంబర్ 14న అస్తమించారు.