తలవంచిన నిరంకుశత్వం | - | Sakshi
Sakshi News home page

తలవంచిన నిరంకుశత్వం

Sep 17 2025 7:53 AM | Updated on Sep 17 2025 7:53 AM

తలవంచ

తలవంచిన నిరంకుశత్వం

మానాల కేంద్రంగా గెరిల్లా పోరాటం ఎందరో త్యాగమూర్తులు పోరాటకెరటం ‘చెన్నమనేని’

రక్తసిందూరం గాలిపెల్లి

సిరిసిల్ల/ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జి ల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి తెలంగాణ సాయుధ పోరా టంలో వీరోచిత పోరా ట చరిత్రకు చిహ్నమైంది. నిజాం రాజ్యహింసకు ఒకేరోజు 11 మంది ప్రాణాలర్పించి న ఆ నేల రక్త సిందూరమైంది. గాలిపెల్లికి చెందిన కమ్యూనిస్టు యోఽ దుడు బద్దం ఎల్లారెడ్డి నిజాం వ్యతిరేక పోరాటాన్ని సాగించారు. ఈ నేపథ్యంతో ఉద్యమకారులు గాలిపెల్లిలో జాతీయ జెండా ఎగురవేశారు. స్వాతంత్య్ర పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఉద్యమించారు. ఇది జీర్ణించుకోలేని నిజాం పోలీసులు ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపారు. రజాకార్లకు వ్యతిరేకంగా పల్లెలు తిరగబడ్డాయి. పోలీసులు, రజాకార్లపై తిరగబడిన గాలిపెల్లిలో భీకర పోరు సాగింది. ఆ పోరులో గాలిపెల్లికి చెందిన పీసు బక్కయ్య, బద్దం నారాయణ, బుర్రయ్య, పుల్లుగారి ఎల్లయ్య, అల్లెం వెంకయ్య, తాళ్లపల్లికి చెందిన సింగిరెడ్డి రాజిరెడ్డి, నర్సక్కపేటకు చెందిన ఎలేటి రాజిరెడ్డి, సోమారంపేటకు చెందిన ఐరెడ్డి భూంరెడ్డి, బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన తుమ్మోజి నారాయణ అసువులు బాశారు. ఉద్యమంతో సంబంధం లేని గాలిపెల్లికి చెందిన పెరంబుదూరి అనంతయ్య, రంగమ్మ వృద్ధ దంపతులు బలయ్యారు. గ్రామ సమీపంలోని మొక్కజొన్న చేనులో భయంతో తలదాచుకున్న వీరిని రజాకార్లు నిర్ధాక్షిణ్యంగా కాల్చిచంపారు. రజాకార్ల దాడిలో బద్దం ఎల్లారెడ్డి, రాజలింగం, అమృత్‌లాల్‌ శుక్లా చాకచక్యంగా తప్పించుకున్నారు. వీరు తప్పించుకున్నారని తెలిసి ఆగ్రహంతో రజాకార్లు గాలిపెల్లి ఊరును తగులబెట్టారు.

స్ఫూర్తి ప్రదాత బద్దం ఎల్లారెడ్డి

గాలిపెల్లికి చెందిన బద్దం హన్మంతరెడ్డి–లచ్చవ్వ రెండో సంతానంగా 1906లో జన్మించిన బద్దం ఎల్లారెడ్డి యుక్త వయసులోనే కమ్యూనిజం భావజాలాన్ని ఒంటబట్టించుకున్నారు. గెరిల్లా దళాలకు మానాల క్యాంపులో శిక్షణ ఇస్తూ.. పోరాటానికి బాటలు వేశారు. 1948 మార్చి 12న ఇల్లంతకుంట పోలీసు క్యాంపుపై సాయుధ ఉద్యమకారులు దాడి చేసి ఎస్సైతో సహా ఆరుగురు పోలీసులను హతమార్చారు. గాలిపెల్లిలో తన సొంత భూములను పేదలకు పంచడంతో పాటు సిరిసిల్ల ప్రాంతాల్లో దున్నేవాడిదే భూమి అంటూ ఉద్యమాన్ని రగిలించారు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మద్రాసులో అరెస్ట్‌ అయి 3 నెలల జైలుశిక్ష అనుభవించారు. జైలు నుంచి వచ్చి కరీంనగర్‌ జిల్లాలో సాయుధ పోరాటాన్ని సాగించారు. 1951లో జరిగిన తొలి ఎన్నికల్లోనే పీడీఎఫ్‌ అభ్యర్థిగా కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ప్రత్యర్థి పీవీ నర్సింహరావుపై విజయం సాధించారు. 1956లో భారత కమ్యూనిస్ట్‌ పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా పని చేశారు. 1958లో బుగ్గారం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. రెండోసారి 1972లో ఇందుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై నిజాయితీ గల నేతగా ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. బస్సులోనే ప్రయాణిస్తూ సామాన్యులతో కలిసిపోయేవారు. బద్దం ఎల్లారెడ్డి స్ఫూర్తిగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీవై నగర్‌ పేరుతో కార్మిక క్షేత్రం, కరీంనగర్‌లో ఎల్లారెడ్డి భవన్‌ ఉంది. 1979లో తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కొడుకులు రాంరెడ్డి, లక్ష్మారెడ్డి, కూతురు విజయ ఉన్నారు.

పోలీసులు, దొరలు, భూస్వాములు, రజాకార్ల దౌర్జన్యాలను సహించలేని అణగారిన, పీడిత ప్రజలు ఉద్యమించిన రోజు.. గ్రామాల్లోని ప్రజలు ఎక్కడికక్కడ పలుగు, పార, కారం, రోకలి బండలు, వరిసెలు, బరిసెలు.. ఇలా అందిదల్లా ఆడ, మగ తేడా లేకుండా అందరికీ ఆయుధాలుగా మారాయి. అనేకమంది యోధుల త్యాగాల ఫలితమే సెప్టెంబర్‌ 17..

మానాల క్యాంపులో సాయుధులు (ఫైల్‌)

నిజాం సంస్థాన పరిధి

సిరిసిల్ల: తెలంగాణ విముక్తి ఉద్యమం చురుగ్గా సాగుతున్న దశలో 1935 డిసెంబర్‌లో సిరిసిల్లలో నాల్గో ఆంధ్ర మహాసభ మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన జరిగింది. ఈ సభలో తీసుకున్న కీలక నిర్ణయాలతో విముక్తి పోరాటం ఉవ్వెత్తున ఎగిసింది. సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, బూరుగుల రామకృష్ణారావు, పీవీ నర్సింహరావు, బద్దం ఎల్లారెడ్డి, కె.వి.రంగారెడ్డి లాంటి వారితో జిల్లాలోని పలువురు నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. గాలిపెల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి తెలంగాణ విముక్తి ఉద్యమంలో ప్రధానంగా ముందున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎందరో త్యాగమూర్తులు ని జాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. చందుర్తి మండలం బండపల్లికి చెందిన గడ్డం తిరుపతిరెడ్డి, వేములవాడకు చెందిన గుమ్మి పుల్లయ్య, కోనరావుపేటకు చెందిన రాజలింగం, నిమ్మపల్లికి చెందిన అనుముల నర్సయ్య, మల్కపేటకు చెందిన కర్రోళ్ల నర్సయ్య, సిరిసిల్లకు చెందిన గర్ధాస్‌ గంగారాం వీరోచిత పోరాటాన్ని సాగించి విజయాన్ని సాధించారు.

సాహసోపేత ఉద్యమంలో సిరి సిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు పోరాట కెరటమయ్యారు. కోనరావుపేట మండలం నాగారంకు చెందిన రాజేశ్వర్‌రావు 1948 నుంచి 1951 వరకు భార్య లలితతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లి ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు. నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి జైలుశిక్ష అనుభవించారు. 957, 1967, 1978, 1985, 1994, 2004లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.

తలవంచిన నిరంకుశత్వం1
1/5

తలవంచిన నిరంకుశత్వం

తలవంచిన నిరంకుశత్వం2
2/5

తలవంచిన నిరంకుశత్వం

తలవంచిన నిరంకుశత్వం3
3/5

తలవంచిన నిరంకుశత్వం

తలవంచిన నిరంకుశత్వం4
4/5

తలవంచిన నిరంకుశత్వం

తలవంచిన నిరంకుశత్వం5
5/5

తలవంచిన నిరంకుశత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement