
కట్టెలు పట్టుకొని వెళ్తున్నాం
మేము మిత్రులం ఐదారుగురం కలిసి రోజూ ఉదయం, రాత్రి వాకింగ్‌కు వెళ్తుంటాం. ఇటీవల కుక్కలు రోడ్లపై గుంపులుగా తిరుగుతున్నాయి. చాలా మందిపై దాడి చేశాయి. కుక్కల భయంతోనే వాకింగ్‌కు వెళ్లాలంటేనే భయంగా ఉంది. చేతిలో కట్టెలు లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలి.
– బుస్స గంగాధర్, వ్యాపారి, ఎల్లారెడ్డిపేట
వెంటపడి కరిచింది
నేను ఊరిలో బట్టలు ఇసీ్త్ర చేసి బతుకుతున్నాను. రోజులాగే ఇసీ్త్ర చేసేందుకు డబ్బా వద్దకు వెళ్తుండగా కుక్క వెంటపడి కరిచింది. కుక్కలను నివారించాలని గ్రామపంచాయతీ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. గతంలో అనేకమందిపై కుక్కలు దాడి చేశాయి. ఇప్పటికై నా కుక్కల బాధను తొలగించాలి.
– లింగమ్మగారి భాస్కర్,
రాచర్లబొప్పాపూర్

కట్టెలు పట్టుకొని వెళ్తున్నాం