
ఎన్నికల హామీలు అమలు చేయడం లేదు
వేములవాడ: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ ఎందుకు పెంచడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిక ప్రశ్నించారు. మహాగర్జన సన్నాహక సదస్సును స్థానిక భీమేశ్వర గార్డెన్‌లో సోమవారం నిర్వహించారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా పెన్షన్లు పెంచకుండా మోసం చేస్తుందన్నారు. సడిమెల శోభారాణి, పుట్ట రవి, లక్ష్మణ్, గుండ థామస్, ఆవునూరి ప్రభాకర్, భిక్షపతి, శ్రీధర్, ప్రతాప్, సాహిత్య, దేవరాములు, నారాయణ పాల్గొన్నారు.