ఇంటర్‌ ‘లాకింగ్‌’ స్టార్ట్‌! | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ‘లాకింగ్‌’ స్టార్ట్‌!

Jul 23 2025 5:38 AM | Updated on Jul 23 2025 5:38 AM

ఇంటర్‌ ‘లాకింగ్‌’ స్టార్ట్‌!

ఇంటర్‌ ‘లాకింగ్‌’ స్టార్ట్‌!

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

ఎట్టకేలకు పెద్దపల్లి–జగిత్యాల సెక్షన్‌, కాజీపేట–బల్లార్షా సెక్షన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు మొదలు కానున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రయాణికుల కలనెరవేరనుంది. పెద్దపల్లి రైల్వే జంక్షన్‌కి సమీపంలో బైపాస్‌ రైల్వే మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఈ నెల 24 నుంచి 27 వరకు ఇంటర్‌ లాకింగ్‌ పనులను దక్షిణమధ్య రైల్వే చేపట్టనుంది. కాజీపేట–బల్లార్షా సెక్షన్‌, పెద్దపల్లి–జగిత్యాల మార్గాలను అనుసంధా నం పూర్తికానుంది. ఈ కారణంగా కాజీపేట నుంచి బల్లార్షా మార్గంలో నడిచే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు, పలు రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.

రద్దైన రైళ్లు..

● 67771/72 కరీంనగర్‌–సిర్పూర్‌ టౌన్‌ నుంచి కరీంనగర్‌ మెము ఎక్స్‌ ప్రెస్‌ ( 25 నుంచి 27 వ తేదీలో )

● 17003/04 రామగిరి మెము ఎక్స్‌ ప్రెస్‌ ( 25 నుంచి 27 వ తేదీల్లో)

● 17035/36 బల్లార్షా నుంచి కాజీపేట నుంచి బల్లార్షా ఎక్స్‌ ప్రెస్‌ ( 24 నుంచి 26 తేదీల్లో ఎగువ మార్గంలో బల్లార్షా వైపు , 25 నుంచి 27 తేదీల్లో దిగువ మార్గంలో కాజీపేట వైపు )

● 12757/58 సికింద్రాబాద్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లను ఈ నెల 25 నుంచి 27 తేదీల్లో పూర్తిగా రద్దుచేశారు.

పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు

● కాజీపేట/వరంగల్‌ నుంచి సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ మార్గంలో, ఇవి కాజీపేట నుంచి సికింద్రాబాద్‌ మధ్య మాత్రం యథాతథంగా నడుస్తాయి.

● 17011/12 ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు హైదరాబాదు నుంచి సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ నుంచి బీదర్‌ ( 25 నుంచి 27 వ తేదీల్లో)

● 17033/34 భద్రాచలం రోడ్డు నుంచి బల్లార్షా నుంచి సిర్పూర్‌ టౌన్‌ నుంచి భద్రాచలం రోడ్డు సింగరేణి మెము ఎక్స్‌ ప్రెస్‌ ( 25 నుంచి 27 వ తేదీల్లో)

● భాగ్యనగర్‌ ఎక్స్‌ ప్రెస్‌ 17233 ఎగువ మార్గంలో 24 నుంచి 26 వ తేదీల్లో మరియు భాగ్యనగర్‌ ఎక్స్‌ ప్రెస్‌ 17234 దిగువ మార్గంలో 25 నుంచి 27 వ తేదీల్లో పాక్షికంగా రద్దు చేశారు.

● పెద్దపల్లి జంక్షన్‌ దగ్గర రైల్వే బైపాస్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి కొన్ని రైళ్లను ప్రారంభ స్టేషన్‌ నుంచి నిర్దేశించిన సమయం కంటే 2 గంటల 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది.

● తిరుపతి నుంచి కరీంనగర్‌ 12761 బై వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలు 26 వ తేదీ రోజున తిరుపతి రైల్వే స్టేషన్‌ నుంచి రాత్రి 8:05 నిమిషాలకు బయలుదేరాల్సి ఉండగా 2 గంటల 30 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం అవుతుంది. అంటే రాత్రి 10:35 నిమిషాలకు బయలుదేరుతుంది

● జూలై 24 వ తేదీ రోజున కొత్త ఢిల్లీ నుంచి నాంపల్లి హైదరాబాదు వెళ్లే తెలంగాణ 12724 సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలును దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో 1 గంట 15 నిమిషాల పాటు నియంత్రించారు.

● నిజాముద్దీన్‌ ఢిల్లీ నుంచి కే.ఎస్‌.ఆర్‌ బెంగళూరు సిటీ మధ్య నడుస్తున్న 22692 రాజధాని సూప ర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలును దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో 20 నిమిషాలు నియంత్రించారు.

● చైన్నె సెంట్రల్‌ నుంచి కొత్త ఢిల్లీ తమిళనాడు 12621 సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలును దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో గంట సేపు నియంత్రించారు.

● విశాఖపట్నం నుంచి కొత్త ఢిల్లీ ఆంధ్రప్రదేశ్‌ 20806 సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలును 45 నిమిషాల పాటు దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో నియంత్రించారు.

పెద్దపల్లి–కరీంనగర్‌ లైన్ల అనుసంధానం షురూ

24 నుంచి 27 వరకు పనులు చేపట్టనున్న దక్షిణ మధ్య రైల్వే

కాజీపేట బల్లార్షా మార్గంలో పలు రైళ్ల మళ్లింపు

కొన్ని పూర్తిగా రద్దు, మరి కొన్ని ఆలస్యం

బైపాస్‌ స్టేషన్‌ నిర్మించే వరకు పెద్దపల్లిలోనే రైళ్ల హాల్టింగ్‌

బైపాస్‌ స్టేషన్‌ నిర్మించే వరకు రైలు పెద్దపల్లిలోనే..

పెద్దపల్లి బైపాస్‌ రైల్వేస్టేషన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనులు పూర్తయినప్పటికీ.. తిరుపతి–కరీంనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ పెద్దపల్లిలోనే ఆగనుంది. వాస్తవానికి బైపాస్‌ లైన్‌పూర్తయితే పెద్దపల్లిలో ఆగకుండా నేరుగా జమ్మికుంట వైపు వెళ్తుందని ప్రచారం జరిగింది. దీనిని సమర్థిస్తూ ..జూన్‌ నుంచి తిరుపతి–కరీంనగర్‌ రైలును ఐఆర్‌సీటీసీ రిజర్వేషన్‌ నుంచి తొలగించడంతో అప్పట్లో కలకలం రేపింది. దీనిపై ఉమ్మడి జిల్లాతోపాటు పెద్దపల్లిలోనూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెద్దపల్లి బైపాస్‌ లైన్‌ వద్ద స్టేషన్‌ నిర్మించేంత వరకు పెద్దపల్లి స్టేషన్‌లో కరీంనగర్‌– తిరుపతి రైలు ఆగుతుంది. పెద్దపల్లి బైపాస్‌ స్టేషన్‌ వద్ద ప్రస్తుతం చిన్న క్యాబిన్‌ మాత్రమే ఉంది. ఇక్కడ ఒక స్టేషన్‌తోపాటు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి నిర్మించాల్సి ఉంటుంది. ఈ నిర్మాణాలు పూర్తయితే తప్ప..పెద్దపల్లి బైపాస్‌ స్టేషన్‌లో రైళ్ల హాల్టింగ్‌ ఉండదని స్పష్టమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement