
సమస్యలు పరిష్కరించాలి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): టెక్స్‌టైల్ పార్కులో పనిచేస్తున్న పవర్‌లూం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్ చేశారు. మంగళవారం బద్దెనపల్లి, సారంపల్లి టెక్స్‌టైల్ పార్క్ ఒకరోజు బంద్ నిర్వహించి, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ టెక్స్‌టైల్ అధి కారులు, యజమానులు అనుసరిస్తున్న విధానాలతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి కార్మికులకు నష్టం జరగకుండా 10శాతం యారన్ సబ్సి డీని తగ్గించకుండా మీటర్‌కు రూ. 1.42 చొప్పున అందించాలని, త్రిఫ్ట్ డబ్బులు కార్మి కుల ఖాతాలో జమ చేయాలన్నారు. ఏడీ ఇచ్చిన హామీ ప్రకారం వారంరో జుల్లో సమస్యలు పరిష్కరించాలన్నారు. యూనియన్ అధ్యక్షుడు కూచన శంకర్, జెల్ల సదానందం, ఆడెపు రవి, సంపత్, రాజ మ ల్లు, శ్రీకాంత్, ఆంజనేయులు పాల్గొన్నారు.
మద్యపానంతో సమస్యలు
సిరిసిల్ల: మద్యపాన వ్యసనం మానసిక సమస్యలను సృష్టించి మనిషి జీవితాన్ని గందరగోళానికి గురి చేస్తుందని ప్రముఖ సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మనగర్‌లో మంగళవారం నేతన్నలకు సామూహిక కౌన్సెలింగ్ నిర్వహించారు. మద్యపానం దీర్ఘకాలిక మానసిక ఒత్తిడికి గురి చేసి మెదడు, నరాల బలహీనతలకు కారణ మవుతుందన్నారు. మద్యం ఒక్కసారిగా మా ని వేస్తే నిద్ర సమస్యలు, కాళ్లు, చేతులు వనకడం, శరీరం అదుపు తప్పడం, మానసికంగా భ్రమలు, భయబ్రాంతులకు లోనవుతారని వివరించారు. మద్యం మానుకునేందుకు జి ల్లా జనరల్ ఆస్పత్రిలోని మైండ్‌కేర్ సెంటర్ ను సంప్రదించాలన్నారు. అత్యవసర సమయంలో 88018 88805 నంబర్‌కు ఫోన్‌చేసి కౌన్సెలింగ్ పొందవచ్చని పేర్కొన్నారు. మనో వికాస కేంద్రం సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ, వస్త్రోత్పత్తి దారుడు ఏనుగుల మనోజ్ పాల్గొన్నారు.
నేడు విద్యాసంస్థల బంద్
సిరిసిల్లటౌన్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ నిరంతర పోరాటాలు చేస్తోందని సంఘం జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. మంగళవారం సిరిసిల్లలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 23వ తేదీన తలపెట్టిన పాఠశాలలు, జూని యర్ కళాశాలల బంద్‌ను విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు కడారి శివ, నాయకులు జశ్వంత్, సుశాంత్, సాయిశివ, శ్రేయాన్, సాజిద్, ఉస్మాన్ పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ అవినీతికి ఆనవాలు చెక్‌డ్యాం
సిరిసిల్లటౌన్: మానేరువాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతికి ఆనవాళ్లుగా నిలిచాయని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్ అన్నారు. సిరిసిల్ల– తంగళ్ళపల్లి మధ్యలో మానేరువాగుపై నిర్మించిన చెక్‌డ్యాంను సీపీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సందర్శించారు. రూ.110 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి మానేరు నదిపై తొ మ్మిది చెక్ డ్యాములు నిర్మించగా, కాంట్రాక్ట ర్లు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో ఇప్పటికే ఏడు చెక్‌డ్యాంలు తెగిపోయాయని విమర్శించారు. మానేరుపై నిర్మించిన చెక్‌డ్యాంల్లో జరిగిన అవినీతిని ప్రజలకు వివరించేందుకు త్వరలోనే సీపీఐ జిల్లా కమిటీ ఆ ధ్వర్యంలో ఎగువ మానేరు నుంచి మధ్యమానేరు వరకు పాదయాత్ర చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పంతం రవి, కడారి రాములు, సోమ నాగరాజు, జంగం అంజయ్య, మీసం లక్ష్మణ్ పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలి

సమస్యలు పరిష్కరించాలి

సమస్యలు పరిష్కరించాలి