
ముక్కోటి మొక్కులు
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో మంగళవారం భక్తి పారవశ్యం వెల్లివిరిసింది. స్థానిక హరిహరపుత్ర అయ్యప్ప ఆలయంలో శ్రీ రాజశ్యామల వారాహి సహిత లలితా త్రిపుర సుందరి ఆలయ 4వ వార్షికోత్సవం వేడుకలు నేత్రపర్వంగా నిర్వహించారు. సుమారు 550మంది సుహాసినులు శ్రీ చక్రాలతో ముక్కోటి కుంకుమార్చనలు నిర్వహించారు. మూడో రోజు కార్యక్రమంలో అర్ధనారీశ్వరీ రూపంలో శ్రీ లలితా త్రిపుర సుందరిమాత దర్శనమిచ్చారు. అమ్మవారిని నిమ్మకాయల మాలతో
అలంకరణ చేశారు. హరిహర పుత్ర అయ్యప్ప ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు రాచ
విద్యాసాగర్‌స్వామి, ప్రయాకర్‌రావు మధు, కూన సురేశ్, గడ్డం భగవాన్ పాల్గొన్నారు.

ముక్కోటి మొక్కులు