
చిరుతను చూశా
పొలానికి నీళ్లు పెట్టేందుకు మోటార్ వద్దకు వెళ్తుండగా దూరం నుంచి చిరుత కన్పించింది. పరుగెత్తుకెళ్లి ఊరిలో చెప్పాను. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాం. వారు వచ్చి చిరుత పాదముద్రలు సేకరించారు. అప్పటి నుంచి పొలం వద్దకు వెళ్దాంటే భయమేస్తోంది. – సురేశ్, రైతు, రాగట్లపల్లి
అప్రమత్తంగా ఉండాలి
ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి, పదిర, హరిదాస్‌నగర్ గ్రామాల్లో చిరుత సంచరించినట్లు గుర్తించాం. రాత్రి పూట రైతులు పొలాల వద్దకు వెళ్లొద్దు. పగటి పూట గుంపులుగా వెళ్లాలి. చిరుత సంచరించినట్లు అనుమానం ఉంటే సమాచారం ఇవ్వాలి.
– సకారాం, ఫారెస్ట్ సెక్షన్ అధికారి, గొల్లపల్లి రేంజ్

చిరుతను చూశా