
సిబ్బంది అందుబాటులో ఉండాలి
● జిల్లా పశువైద్య, పశుసంవర్థకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి
బోయినపల్లి(చొప్పదండి): పాడి రైతులకు పశువై ద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా పశువైద్య, పశుసంవర్థకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి ఆదేశించారు. మండలంలోని విలాసాగర్, బోయినపల్లి పశువుల ఆస్పత్రులను శుక్రవారం తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు రిజిష్టర్, పనితీరు పరిశీలించారు. పశువులకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాడిరైతులకు అవగాహన కల్పించాలని సూచించా రు. ఉద్యోగులు సమయపాలన పాటించాలన్నారు. పశువైద్యాధికారులు గిరిధర్, శ్రీధర్ ఉన్నారు.