వేములవాడ కోర్టులో అన్నదానం | - | Sakshi
Sakshi News home page

వేములవాడ కోర్టులో అన్నదానం

Jul 12 2025 7:07 AM | Updated on Jul 12 2025 11:25 AM

వేముల

వేములవాడ కోర్టులో అన్నదానం

● ప్రతీ శుక్రవారం కక్షిదారుల కోసం ఏర్పాటు

వేములవాడ: పట్టణంలోని కోర్టుకు వచ్చే కక్షిదారులకు ప్రతీ శుక్రవారం అన్నదానం చేయడం అభినందనీయమని జడ్జీలు అజయ్‌కుమార్‌ జాదవ్‌, ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. వివిధ కేసులపై వేములవాడ కోర్టుకు వచ్చే కక్షిదారుల కోసం వేములవాడ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ప్రారంభించారు. ప్రతీ శుక్రవారం కక్షిదారుల కోసం అన్నదానం చేయనున్నట్లు న్యాయవాదులు తెలిపారు. మొదటి అన్నదాతగా సీనియర్‌ న్యాయవాది నేరెళ్ల తిరుమల్‌గౌడ్‌ ముందుకొచ్చారు. వేములవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుండ రవి, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు కట్కం జనార్దన్‌, క్యాషియర్‌ బొజ్జ మహేందర్‌, మహిళా ప్రతినిధి జక్కుల పద్మ, సీనియర్‌ కార్యవర్గ సభ్యులు తమ్మిరి అన్నపూర్ణ, బూర సరిత, లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ బొజ్జ నరేశ్‌ పాల్గొన్నారు.

బతుకమ్మ తెప్ప నిర్మించండి

బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాక ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో బతుకమ్మ తెప్ప, కరీంనగర్‌–వేములవాడ ప్రధాన రహదారిలోని బస్‌స్టాప్‌ వద్ద బస్సుషెల్టర్‌ నిర్మించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు యూత్‌ కాంగ్రెస్‌ మండల మాజీ అధ్యక్షుడు నాగుల వంశీ కోరారు. కొదురుపాక ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో బతుకమ్మ తెప్ప లేక బతుకమ్మ నిమజ్జనాలకు మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, నాగుల అంజయ్య, కుడుదుల రాజమల్లు, బాలగోని దేవయ్య, కత్తెరపాక శ్రీనివాస్‌, అభిలాష్‌, మైలారం విక్కి, సట్ట తిరుపతి, సట్ట నరేశ్‌ ఉన్నారు.

జేఈఈ నీట్‌కు ఆన్‌లైన్‌లో శిక్షణ

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలలో చదువుతున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌లో జేఈఈ, నీట్‌ శిక్షణ అందించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి శ్రీనివాస్‌ తెలిపారు. ఇల్లంతకుంట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం డిజిటల్‌ తరగతిగదిని ప్రారంభించి మాట్లాడారు. ఖాన్‌ అకాడమీ, ఫిజిక్స్‌ వాలా.. వంటి కోచింగ్‌ సెంటర్ల సౌజన్యంతో ఆన్‌లైన్‌లో కోచింగ్‌ అందించనున్నట్లు పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ దేవరాజం, అధ్యాపకులు నయీమొద్దీన్‌, మల్లారెడ్డి, శ్రీనివాస్‌, జీవన్‌, బాబు, లక్ష్మయ్య పాల్గొన్నారు.

బీసీలకు రిజర్వేషన్ల అమలు చారిత్రాత్మకం

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు

సిరిసిల్లటౌన్‌: జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం చారిత్రాత్మకమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన మాట మేరకు బీసీలకు సామాజిక న్యాయం అమలు చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి, రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి బీసీలు ఎంత చేసినా తక్కువేనన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరవేని మల్లేశ్‌యాదవ్‌, సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు తడక కమలాకర్‌, కోడం రవీందర్‌, అల్వాల మల్లేశ్‌, ఇల్లంతకుంట తిరుపతి, ఆంజనేయులు, శ్రీకాంత్‌, బోయిని శ్రీనివాస్‌, తిరుపతి, ప్రభాకర్‌, శ్రీధర్‌, దామోదర్‌, కొండయ్య, మల్లేశం పాల్గొన్నారు.

వేములవాడ కోర్టులో   అన్నదానం
1
1/3

వేములవాడ కోర్టులో అన్నదానం

వేములవాడ కోర్టులో   అన్నదానం
2
2/3

వేములవాడ కోర్టులో అన్నదానం

వేములవాడ కోర్టులో   అన్నదానం
3
3/3

వేములవాడ కోర్టులో అన్నదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement