
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా రాజేశ్వరీ
సిరిసిల్లఅర్బన్: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ జె.రాజేశ్వరీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్‌లో ప్రొఫెసర్, హెచ్‌వోడీగా బాధ్యతలు నిర్వర్తించి పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ప్రొఫెసర్‌గా, సీనియర్ గైనకాలజిస్ట్‌గా ఉస్మానియా వైద్యకళాశాల అనుబంధ ప్రసూతి ఆస్పత్రిలో, ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో అసోసియేట్ ప్రొఫెసర్, మిర్యాలగూడ ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యసేవలు అందించారు. రాజేశ్వరీకి డాక్టర్ బి.లక్ష్మీనారాయణ, బోధన, బోధనేతర సిబ్బంది పుష్పగుచ్ఛం అందించారు.