
రహీంఖాన్‌పేటలో స్వచ్ఛ సర్వేక్షన్ బృందం
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రహీంఖాన్‌పేటలో గురువారం స్వచ్ఛసర్వేక్షన్ గ్రామీణ్ కేంద్ర బృందం పర్యటించింది. గ్రామంలో ప్రతీ ఇంటికి వెళ్లి ఇంకుడుగుంత, కిచెన్‌గార్డెన్‌ను పరిశీలించారు. ప్రైమరీ స్కూల్ వద్ద రోడ్డుపై పారుతున్న మురికినీటిని చూసి వెంటనే పనులు చేపట్టాలని సెక్రటరీకి సూచించారు. గ్రామంలోని కంపోస్ట్‌షెడ్డు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ మెంబర్ అనూష, స్వచ్ఛభారత్ మిషన్ మెంబర్ సురేష్, ఎంపీడీవో శశికళ, ఎంపీవో శ్రీనివాస్, కార్యదర్శి సంధ్య, ఏఎన్‌ఎం స్వరూప, చెర్ల శ్రీనివాస్, అంగన్‌వాడీలు స్వప్న, ఐలవ్వ, సీఏ పద్మ పాల్గొన్నారు.
ముస్తాబాద్(సిరిసిల్ల): మద్దికుంటలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను గురువారం చేపట్టారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2025లో భాగంగా మద్దికుంటలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆలయం, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రంలో రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ శిరీష సర్వేచేశారు. ఎస్‌బీఎం అసిస్టెంట్ ప్రేమ్, ఎంపీడీవో బీరయ్య, ఏపీఎం మోహన్ పాల్గొన్నారు.
ప్రతి ఓటరునూ నమోదు చేయాలి
సిరిసిల్ల: పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతీ ఒక్కరిని ఓటర్లుగా నమోదు చేయాలని, మరణించిన ఓటర్లను నిబంధనల మేరకు తొలగించాలని సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్ వెంకటేశ్వర్లు సూచించారు. సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం బూత్ లెవల్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఆర్డీవో మాట్లాడుతూ ఓటర్ల జాబితాను ఆధునీకరించాలని, తప్పులు లేని జాబితాను సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతులు కల్పనను పరిశీలించాలని అధికారులకు సూచించారు. సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్, డిప్యూటీ తహసీల్దార్లు కె.భాస్కర్‌రెడ్డి, అశోక్, మాస్టర్ ట్రైనర్ పాతూరి మహేందర్‌రెడ్డి, ఆరు మండలాల బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు.
సమాజ నిర్మాణంలో గురువులే కీలకం
సిరిసిల్లఅర్బన్: సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అత్యంత కీలకమని వారిని సన్మానించుకోవడం మన బాధ్యత అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. సిరిసిల్లలోని బీజేపీ ఆఫీస్‌లో పార్టీ పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి సందర్భంగా వివిధ రంగాల్లో గురుతర బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని సన్మానించారు. సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, బీజేపీ సీనియర్ నాయకులు గరిపెల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
సిరిసిల్లకల్చరల్: చదువుకునే దశలోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ పేర్కొన్నారు. అనంతనగర్‌లోని సాయిశ్రీ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. చట్టాలపై అవగాహన లేక జీవితంలో నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. సీనియర్ న్యాయవాది చెక్కిళ్ల మహేశ్‌గౌడ్ పోక్సో చట్టం గురించి వివరించారు. న్యాయవాది గెంట్యాల భూమేశ్, కళాశాల కరస్పాండెంట్ చౌటపెల్లి శ్రీనివాస్, ప్రిన్సిపాల్ మేడిచెలిమెల తిరుపతి మాట్లాడారు.
వర్షం జల్లులు
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా గురువారం వర్షం జల్లులు కురిశాయి. అత్యధికంగా తంగళ్లపల్లిలో 16.3 మిల్లీమీటర్లు, రుద్రంగిలో 3.8, చందుర్తిలో 5.2, వేములవాడరూరల్‌లో 7.4, బోయినపల్లిలో 3.5, వేములవాడలో 11.5, సిరిసిల్లలో 8.6, కోనరావుపేటలో 8.5, వీర్నపల్లిలో 9.8, ఎల్లారెడ్డిపేటలో 15.1, గంభీరావుపేటలో 6.0, ముస్తాబాద్‌లో 2.6, ఇల్లంతకుంటలో 13.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

రహీంఖాన్‌పేటలో స్వచ్ఛ సర్వేక్షన్ బృందం

రహీంఖాన్‌పేటలో స్వచ్ఛ సర్వేక్షన్ బృందం