
వైఎస్సార్ ఆశయాలు ఆదర్శం
సిరిసిల్లటౌన్: అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అందించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలు అన్నివర్గాలకు ఆదర్శమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌లో పట్టణ అ ధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో వై ఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా వక్తలు మాట్లాడారు. పేదల సంక్షేమానికి వై ఎస్సార్ పథకాలు ప్రవేశపెట్టారని, ఆయన అందించిన సేవలు సర్వదా అన్నివర్గాల వారికి అనుసరణీయంగా పేర్కొన్నారు. కార్మికక్షేత్రం సిరిసిల్ల్లతో వైఎస్సార్‌కు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఇక్కడి నేతకార్మికుల ఆత్మహత్యలు, ఆకలిచావుల నేపథ్యంలో వాటిని నివారించడానికి అనేక పథకాలు అందించి, నిరంతరం పనిదొరికేలా చేశారన్నారు. అనారోగ్యంతో ఉంటున్న కార్మిక కుటుంబాల సభ్యులకు, పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ.లక్షలు విలువచేసే ఆపరేషన్లు, వైద్యసేవలు అందించారని కొనియాడారు. అనంతరం పార్టీ నేతలు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, పార్లమెంట్ కోకన్వీనర్ కనిమేని చక్రధర్‌రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, వైద్య శివప్రసాద్, మ్యాన ప్రసాద్, కాముని వనిత, చందన, రాగుల జగన్, యెల్లె లక్ష్మీనారాయణ, దేవదాసు, గోలి వెంకటరమణ, భాను తదితరులు పాల్గొన్నారు.