
ముంపు గ్రామాల సమస్యలకు పరిష్కారం
● విప్ ఆది శ్రీనివాస్
వేములవాడఅర్బన్: మిడ్‌మానేర్ ప్రాజెక్ట్ ముంపునకు గురైన గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మండలం అగ్రహారంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ముంపు గ్రామాల నిర్వాసితులు ఇళ్లు లేక ఖాళీ ప్లాట్స్ ఉన్నవారికి స్పెషల్ కోటా కింద 847 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఇచ్చిన మాటప్రకారం ఒక్కో హామీ అమలు చేస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు 4 దశల్లో రూ.5 లక్షల ఆర్థికసాయం అందుతుందన్నారు.
అంజన్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు
అగ్రహారం ఆంజనేయస్వామి, శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం అగ్రహారం ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో రూ.34.50 లక్షలతో చేపట్టే ఫ్లోరింగ్ పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో రాజీవ్‌మల్హోత్ర, ఆలయ ఈవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.