
ఆరోగ్యమే గొప్ప సంపద
● ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్లక్రైం/తంగళ్లపల్లి(సిరిసిల్ల) : ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే గొప్ప సంపద అని ఎస్పీ అఖిల్ మహా జన్ అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిత్యం విధులు నిర్వర్తించే పోలీసులు వారి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో తారకరామ, లక్ష్మీనరసింహ ఆసుపత్రుల ఆ ధ్వర్యంలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి హె ల్త్‌చెకప్ క్యాంపు నిర్వహించారు. వివిధ రకాల వై ద్య పరీక్షలు చేసిన వైద్యులు అవసరమైన సలహా లు, సూచనలు చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉంటే విధులు సక్రమంగా నిర్వహిస్తారని, మంచి ఆరోగ్యానికి రో జూ వ్యాయామం అవసరమన్నారు. ప్రస్తుత పరి స్థితుల్లో వ్యాధులు త్వరగా సంక్రమిస్తున్నాయని, ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే అవి రాకుండా చూడవచ్చన్నారు. రోజువారీ పనిలో నడక, వ్యా యామం, యోగ భాగం కావాలని వివరించారు. వీటికి అదనంగా వైద్యులు చెప్పే సూచనలు పా టించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు చంద్రశేఖరరెడ్డి, నాగేంద్రచారి, మురళీకృష్ణ, వైద్యులు మహేశ్, నరేశ్‌కుమార్, రీనా శర్మిలీ, సూర్య, సాయిరాం, లక్ష్మణ్, రమేశ్, సీఐలు రఘుపతి, అనిల్‌కుమార్, శ్రీనివాస్, ఆర్‌ఐ యాదగిరి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.