
మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిసిన వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు
● కథలాపూర్ ఏఎంసీ చైర్మన్‌గా సౌజన్య
వేములవాడ: వడగండ్ల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతుకు రూ.10వేల చొప్పున నష్టపరిహారం అందించిన మంత్రి నిరంజన్‌రెడ్డికి ఎమ్మెల్యే రమేశ్‌బాబు శుక్రవారం హైదరాబాద్‌లో కలుసుకుని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మేడిపల్లి మండలం పసునూరులో ఆరెకరాలు, కథలాపూర్ మండలం కలికో టలో 20 ఎకరాలు, రుద్రంగి మండలంలో 26 ఎకరాలలోని పంటలకు నష్టపరిహారం చెల్లించినట్లు ఎ మ్మెల్యే రమేశ్‌బాబు పేర్కొన్నారు. కథలాపూర్ మా ర్కెట్ కమిటీ చైర్మన్‌గా గుండారపు సౌజన్య, వైస్‌చైర్మన్‌గా సోమ దేవేందర్‌రెడ్డిలతోపాటు పాలకవర్గ స భ్యులుగా ఆనుగు ఆదిరెడ్డి, వన్నెల గంగరాజం, రా చమడుగు గంగారావు, కల్లూరి రమేశ్, బాలె రూ పిక, లౌడ్య నరేశ్, లక్క రమేశ్, సబ్బని గంగు, షేక్ ముగ్దుంబాషా, కొత్తపల్లి శ్రీనివాస్, వేణుగోపాల్, మేడిపల్లి రాజారెడ్డి, దాసరి గంగాధర్‌ను నియమించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.