
సాక్షి దినపత్రిక 15వ వార్షికోత్సవ సంబరాలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లోని యూని ట్ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్‌చేశారు. బ్రాంచ్ మేనేజర్ వి.శ్రీనివాస్, బ్యూరో ఇన్‌చార్జి అనిల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఎడిషన్ ఇన్‌చార్జీలు బి.శ్రీనివాస్, జి.మహేశ్, పెద్దపల్లి స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్, ఉమ్మడి జిల్లాలోని ఆర్సీ ఇన్‌చార్జీలు, ఏడీవీటీ మేనేజర్ లక్ష్మినారాయణ, ఐటీ మేనేజర్ వేణు, ఏసీఎం మధుకర్, ప్రొడక్షన్ ఇన్‌చార్జి ప్రకాశ్, స్టోర్ ఇన్‌చార్జి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.