
హాజరైన విద్యార్థినులు
సిరిసిల్లక్రైం: మహిళలు, యువతులు, విద్యార్థినిలు భద్రతకు షీటీమ్ పనిచేస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. షీటీమ్ అందించే సేవలపై సిరిసిల్లలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం 8, 9వ తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థినులను, మహిళలను ఇబ్బందులకు గురిచేయడం, ఈవ్‌టీజింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్నించాలన్నారు. సోషల్‌మీడియాలో కానీ, నేరుగా కాని వేధిస్తే వెంటనే 100, జిల్లా షీటీమ్ నంబర్ 87126 56425లో సమాచారం ఇవ్వాలని కోరారు. మైనర్‌లపై అఘాయిత్యాలకు పాల్పడితే ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. విద్యార్థులు సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలన్నారు. ఉన్నత విద్యతోనే వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. చదువుకునే వయసులో యువతులు ప్రలోభాలు, ఆకర్షణలకు గురై భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని కోరారు. డీఎస్పీ విశ్వప్రసాద్, సీఐ అనిల్‌కుమార్, ఎంఈవో రఘుపతి, షీటీమ్ ఎస్సై ప్రేమ్‌దీప్, ఎస్సైలు రాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎస్పీ అఖిల్ మహాజన్