
ఆసుపత్రిలో పిల్లలకు వైద్యం అందిస్తున్న సిబ్బంది
ఆటో బోల్తా
వేములవాడరూరల్: వేములవాడ మండలంలోని నాగాయపల్లి వద్ద ఆటో బోల్తా పడిన సంఘటనలో ఐదుగురు విద్యార్థులలతోపాటు హెచ్‌ఎం, ఆటోడ్రైవర్ గాయపడ్డారు. హెచ్‌ఎం తెలిపిన వివరాలు. మర్రిపల్లి కేజీబీవీ ఇంటర్ విద్యార్థులు వేములవాడలో పరీక్షలు రాసి తిరిగి వస్తుండగా నాగాయపల్లి వద్ద ఆటో బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థినులు గౌతమి, ప్రశణ్య, రుచిత, జ్యోతి, రిజ్వాన్, లెక్చరర్ రజనీ, డ్రైవర్ లక్ష్మీనారాయణ గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కళాశాల స్పెషల్ ఆఫీసర్ శకుంతల ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చి పిల్లలను చూసి రోదించారు.
సమగ్ర శిక్ష సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి
సిరిసిల్లఎడ్యుకేషన్: సమగ్ర శిక్షలో భాగంగా గత పదిహేనేళ్లుగా విద్యాశాఖలో పనిచేస్తున్న కేజీబీవీ, సీఆర్పీ, మిస్‌సీవో, యూఆర్‌ఎస్ స్టాఫ్, డీపీవో స్టాఫ్‌ను రెగ్యులరైజ్ చేయాలని బీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌గౌడ్ కోరారు. సిరిసిల్లలో శుక్రవారం ఆఫీస్ బేరర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, ఒడిశా, హర్యానా రాష్ట్రాలలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేశారని దీని ప్రకారం మన రాష్ట్రంలో ఎస్‌ఎస్‌ఏ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వికృతి లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి బండారి మల్లేశం, జిల్లా అధ్యక్షుడు పులి రామ్‌గోపాల్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికాల సుధాకర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు తాడికొండ కృష్ణహరి, రాష్ట్ర కౌన్సిలర్ కాలేరు రాజన్న, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి పాల్గొన్నారు.