
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న యూఎస్‌పీసీ నాయకులు
సిరిసిల్లటౌన్: ఈ–కుభేర్‌లో పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని యూఎస్‌పీసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సిరిసిల్ల నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఉపాధ్యాయులకు సంబంధించిన బిల్లులు ఐదారు రోజుల్లో చెల్లించే వారని ఇప్పుడు ఏడాది గడుస్తున్నా ఇవ్వకపోవడంపై ప్రశ్నించారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు సకాలంలో వేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. యూఎస్‌పీసీ నాయకులు పాకాల శంకర్‌గౌడ్, దోర్నాల భూపాల్‌రెడ్డి, దొంతుల శ్రీహరి, విజయ్‌కుమార్, మహేందర్, రమానాథ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాజలింగంతోపాటు 200 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఒకటో తేదీన జీతాలు అందించాలి
ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి
కలెక్టరేట్ ఎదుట ధర్నా