
బందనకల్ పటాన్ని పరిశీలిస్తున్న ప్రజాప్రతినిధులు
ముస్తాబాద్(సిరిసిల్ల): స్వచ్ఛమైన పల్లెలను బాగుచేసుకునేలా అందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎంపీపీ జనగామ శరత్‌రావు కోరారు. మండలంలోని బందనకల్ గ్రామాన్ని జిల్లా స్వచ్ఛభారత్ బృందంతోపాటు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వీవోఏలు శుక్రవారం సందర్శించారు. ఇంటింటికీ తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం నిర్వహణ, ప్లాస్టిక్ నియంత్రణ, హరితహారం మొక్కల పెంపకం, ఆరుబయట మలవిసర్జన రహిత గ్రామంగా చేపట్టిన పనులను పరిశీలించారు. ఉపాధిహామీ, ఐకేపీ స్వశక్తి సంఘాల మహిళల సమస్యలను తెలుసుకున్నారు. జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, ఆర్‌బీఎస్ మండలాధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్‌రావు, సర్పంచ్ వెంకటేశ్వరి, ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, ఉపసర్పంచ్ కార్తీక్‌రెడ్డి, ఎంపీడీవో రమాదేవి, స్వచ్ఛభారత్ మిషన్ అధికారి సురేశ్ పాల్గొన్నారు.