సిరిసిల్ల ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను చెల్లించాలని శుక్రవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట యూఎస్‌పీసీ ఆధ్వర్యంలో నిరసన తెలుపనున్నట్లు సంఘం నాయకులు గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏర్పాటు సమావేశంలో నాయకులు మాట్లాడారు. పెండింగ్ బిల్లులను ఈ నెలాఖరులోగా విడుదల చేయాలన్నారు. స్వరాష్ట్రంలో వేతనాల కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు పెద్దసంఖ్యలో హాజరై నిరసన తెలపాలన్నారు. కార్యక్రమంలో యూఎస్‌పీసీ నాయకులు పాకాల శంకర్ గౌడ్, దోర్నాల భూపాల్ రెడ్డి, అవురం సుధాకర్ రెడ్డి, మహేందర్ రావు, మల్లారపు పురుషోత్తం, సత్తు రవీందర్, పరకాల రవీందర్, తడుక సురేశ్, తదితరులు పాల్గొన్నారు.