● రూ.1,53,140 కోల్పోయిన వైనం
సిరిసిల్లక్రైం: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సైబర్‌నేరగాళ్ల వలలో చిక్కి రూ.1.53 లక్షలు మోససోయింది. పోలీసులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణంలోని వెంకట్రావునగర్‌కు చెందిన గురిపెల్లి ఆకాంక్ష సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. మరింత ఆదాయం పొందాలని ఇంటర్‌నెట్‌లో ఓ వెబ్‌సైట్‌ను తెరిచింది. దానిలో తన సమాచారాన్ని అప్‌లోడ్ చేయగా.. వెబ్ నిర్వాహకులు ఆకాంక్షకు రూ.100 రివార్డుగా అందించారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ పెట్టుబడి పెడితే అధికంగా రివార్డు ఇస్తామని నమ్మబలికారు. నమ్మిన ఆకాంక్ష కొంత.. కొంత సొమ్మును పెట్టుబడిగా పెడుతూ ఏకంగా రూ.1,53,140 పెట్టింది. రివార్డు రాకపోవడంతో వెబ్‌సైట్‌లో సమాచారం కోసం వెతికింది. ఇంతలోనే సంబంధిత వెబ్‌సైట్ అదృశ్యమైంది. మోసపోయానని తెలుసుకున్న ఆకాంక్ష సిరిసిల్లటౌన్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసినట్లు సీఐ అనిల్‌కుమార్ తెలిపారు.