టంగుటూరు: సింహపురి ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ ఆధ్వర్యంలో టంగుటూరు టోల్‌ప్లాజాలో ఓవర్ లోడ్ ఫీజు వసూలు పేరుతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. టోల్‌ప్లాజా యాజమాన్యం తీరుతో నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తోంది. దీంతో ఆస్పత్రులకు వెళ్లే రోగులు, పరీక్షలకు వెళ్లే విద్యార్థుల ఇక్కట్లు చెప్పేవీ కావు. సోమవారం సాయంత్రం ట్రాఫిక్‌లో అంబులెన్సు చిక్కుకుపోయింది. ఓవర్ లోడ్ ఫీజు వసూలు కోసం వాహనాలు చాలా సేపు ఆగిపోతున్నాయి. దీంతో అంబులెన్సులతో పాటు పోలీసులు, ప్రజాప్రతినిధుల వాహనాలు సైతం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ తంతు చాలా రోజులుగా జరుగుతున్నా టోల్‌ప్లాజా యాజమాన్యం వైఖరిలో మార్పు రావడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి టోల్‌ప్లాజా యాజమాన్యంపైచర్యలు తీసుకొని ఇక్కట్లు తీర్చాలని వాహనదారులు కోరుతున్నారు.
మారని టంగుటూరు టోల్‌ప్లాజా తీరు
ఓవర్ లోడ్ ఫీజు వసూలుతో వాహనదారులకు ఇక్కట్లు
గంటల పాటు స్తంభిస్తున్న ట్రాఫిక్
ట్రాఫిక్‌లో అంబులెన్సులు చిక్కుకుంటున్నా చలించని వైనం


