ఘనంగా బూచేపల్లి జన్మదిన వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బూచేపల్లి జన్మదిన వేడుకలు

Apr 7 2026 7:19 AM | Updated on Apr 7 2026 7:19 AM

గజమాలలు, బొకేలు, శాలువాలతో బూచేపల్లికి అభినందనలు

ఒంగోలు సిటీ: దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ కట్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు కనపర్తి శేషారెడ్డిల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు తదితరులు ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు, అభిమానులు రక్తదానం చేశారు.

కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దద్దాల నారాయణ యాదవ్‌, అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌, మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ మాదాసి వెంకయ్య, పార్టీ కార్యాదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కె.ఆదెన్న, బి.రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్‌, వైఎస్సార్‌ సీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, మాజీ కార్పొరేటర్‌ వెన్నపూస కుమారి, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాతా నరసింహా గౌడ్‌, సోషల్‌ మీడియా ప్రెసిడెంట్‌ శివకృష్ణారెడ్డి, రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ పోసం మధుసూదన్‌రెడ్డి, త్రిపురాంతకం ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, చీమకుర్తి ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, దర్శి మాజీ ఏఎంసీ చైర్మన్‌ వెన్నపూస వెంకటరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులు నెమలిదిన్నె చెన్నారెడ్డి, కిస్టిపాటి శేఖరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement