సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలి

Apr 7 2026 7:19 AM | Updated on Apr 7 2026 7:19 AM

సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలి ఫ్రంట్‌ ఆఫీస్‌ కోఆర్డినేటర్‌ పరీక్ష రద్దు

మార్కాపురం: ప్రజల నుంచి అందిన సమస్యలతో కూడిన అర్జీలకు పరిష్కారం దిశగా పోలీసులు పనిచేయాలని డీఎస్పీ యూ నాగరాజు ఆదేశించారు. మార్కాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిట్రెస్సల్‌ కార్యక్రమాన్ని డీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పోలీసు అధికారులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. అందిన ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణ జరిపి సత్వర పరిష్కారం కల్పిస్తామనే భరోసా ప్రజల్లో కల్పించాలన్నారు. ఎస్పీ కార్యాలయంలో అందిన ఫిర్యాదులను సంబంధిత పోలీసు స్టేషన్‌లకు తెలియచేసి త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. మీకోసంలో ఉద్యోగ, ఆర్ధిక, కుటుంబ కలహాలు, భూ వివాదాలు, చీటింగు కేసులు తదితర సమస్యలపై 35 అర్జీలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐలు రాజేష్‌కుమార్‌, కే అజయ్‌కుమార్‌, రామకోటయ్య, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఒంగోలు: జిల్లా న్యాయసేవాధికార సంస్థలో రెగ్యులర్‌ ప్రాతిపదికన ఫ్రంట్‌ ఆఫీస్‌ కోఆర్డినేటర్‌ పోస్టు భర్తీ చేసేందుకు 2026 ఫిబ్రవరి 15న నిర్వహించిన పరీక్షను రద్దు చేసినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ టి.రాజ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు రద్దు చేశారన్నారు. మళ్లీ పరీక్ష నిర్వహించే తేదీలను, వాటి వివరాలను రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం త్వరలో తెలియజేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement