ఉచిత పంటల బీమా ఎత్తేసి అన్నదాతలకు అన్యాయం రైతు పక్షాన నిరంతర పోరాటం చేద్దాం దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
దర్శి నియోజకవర్గంలో రెవెన్యూ లీలలు
రూ.కోట్లు విలువజేసే భూముల్లో అక్రమాలు
ఫ్రీహోల్డ్ భూమిని అనువంశికం కిందకు మార్పు
రియల్ వెంచర్‌లో భాగస్వామి అవతారం
తమకు చెందిన 1.17 ఎకరాల భూమిని సర్వేయర్ ద్వారా కొలతలు వేయాలని సుబ్బాయమ్మ దరఖాస్తు చేసుకుంది. స్థానిక సర్వేయర్‌తో జనవరి 9వ తేదీ 2025న కొలతలకు వస్తామని నోటీసులు పంపారు. పండుగ సెలవులు కావడంతో జనవరి 19వ తేదీన కొలతలు వేశారు. అయితే జనవరి 7వ తేదీ కొలతలు వేయకుండానే ఈ భూమి మీది కాదని డిక్లరేషన్ ఇచ్చారని ఆరోపించింది. ఈ విషయంపై కలెక్టర్‌ను కలిసినా తనకు న్యాయం జరగలేదని వాపోయింది. తన మాటలు కలెక్టర్ వినకుండానే ఆఫైల్‌ను పక్కన పడేశారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ప్రస్తుతం కోర్టును ఆశ్రయించానని చెబుతోంది.
ఒంగోలు సిటీ: సీఎం చంద్రబాబు రైతుల ఇబ్బందులను పట్టించుకోకుండా ఎంతసేపూ తన మనుషులకు ఎలా లబ్ధి చేకూర్చాలన్న ధ్యాసలోనే ఉన్నారని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం రైతు విభాగ నాయకులతో సమావేశం నిర్వహించారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారు బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ అమరావతి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, అన్ని రకాలుగా అన్నదాతలకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. పార్టీకి సంబంధించి అన్ని రకాల అనుబంధ కమిటీల నియామకాలు పూర్తయ్యాయని, ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలన్నారు.
రైతు సమస్యలపై పోరాటం చేద్దాం..
రైతు సమస్యలపై నిరంతరం పోరాటం చేద్దామని పార్టీ నాయకులు, కార్యకర్తలకు బూచేపల్లి పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఒంగోలు డెయిరీని మూతేయించి పాడి రైతులకు చంద్రబాబు అన్యాయం చేశారని ఆరోపించారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్ రుణమాఫీ చేసి అండగా నిలిచారని, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పెట్టుబడి సాయం దగ్గర నుంచి గిట్టుబాటు ధర, పంట నష్టపరిహారం సకాలంలో అందజేయడమే కాకుండా ఆర్‌బీకేల ద్వారా అన్ని సేవలను రైతు ముంగిటకు తీసుకొచ్చారని తెలిపారు. ఈ క్రాప్ నమోదు చేసి ఉచిత పంటల బీమా అమలు చేసి సకాలంలో సాయం అందించిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఒక్క దర్శి నియోజకవర్గంలో మిర్చి, మొక్కజొన్న ఇలా రకరకాల పంటలకు పంట నష్టపరిహారం కింద సుమారు రూ.7 లక్షల వరకూ అందుకున్న వారు చాలా మంది ఉన్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులు సంతోషంగా ఉంటేనే సమాజంలోని అన్ని వర్గాలు బాగుంటాయని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా కూడా అందజేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని, పొగాకు, మొక్కజొన్న, శనగ పంటలను కొనేవారు లేక అన్నదాతలు అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంట వేయాలని అధికారుల ద్వారా ప్రోత్సహించారని, తీరా పంట చేతికొచ్చిన తర్వాత మొండి చేయి చూపారని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెస్పీ ధరలకే మొక్కజొన్న పంటను కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పొగాకు కొనుగోలుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల అత్యంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు. గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన బాధ్యతను మరిచిన చంద్రబాబు రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. పెట్టుబడిదారులు రైతుల కష్టానికి ధరలు నిర్ణయిస్తున్నారని, అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. రైతుల పోరాటానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎం.ప్రసాదరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆళ్ల రవీంద్రరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, రైతు విభాగం నాయకులు శంకరరావు, రైతు విభాగం నాయకులు పాల్గొన్నారు.
భూ మాయ..!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు జవాబుదారీగా ఉండాల్సిన రెవెన్యూ అధికారులు గాడి తప్పుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసులకు కక్కుర్తి పడి కోట్లాది రూపాయల విలువైన భూమిని అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల పేరు మీదకు ఆన్‌లైన్‌లో మార్పులు చేసి లబ్ధిదారుల పొట్టకొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని ఓ రెవెన్యూ అధికారి అక్రమాలకు అంతేలేకుండా పోతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రికార్డులను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. సదరు అధికారి రియల్ వెంచర్‌లలో భాగస్వాములుగా మారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారుల తీరుతో నష్టపోతున్నట్లు దర్శికి చెందిన ఓ వృద్ధురాలు వేదన చెందుతోంది. సదరు అధికారి నియోజకవర్గంలోని రెండు మండలాల్లో పనిచేసి ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను పప్పుబెల్లాల్లా పంచిపెట్టి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అండతో మరింత చెలరేగిపోయి భారీ ఎత్తున భూములు బదలాయించి కోట్లు గడించారని రెవెన్యూశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల నోటీసుకు వెళ్లడంతో వారిని సైతం మేనేజ్ చేసే పనిలో పడ్డారని ఆశాఖ అధికారులే చెవులు కొరుక్కుంటున్నారు. అధికార పార్టీ ముఖ్యనాయకులతో ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ వివాదాల నుంచి బయటపడాలన్న ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దర్శిలోని ఓ వెంచర్‌లో భాగస్వామిగా మారిన సదరు అధికారి ఫ్రీహోల్డ్‌లో రూ.కోట్ల విలువైన భూమిని అనువంశీకం కిందకు మార్పు చేశారు. ఈ భూముల్లో రియల్‌ఎస్టేట్ వెంచర్ వేశారు. అలాగే ఎర్రబాలెంలో బ్రిటీష్ కాలం నుంచి ఉన్న భూముల రికార్డులు కూడా తారుమారు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఐదు ఎకరాల భూమికి సంబంధించి అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సదరు భూమి విలువ సుమారు రూ.1.50 కోట్లు ఉంటుందని అంచనా. దొనకొండ రాజధాని అని పుకార్లు రావడంతో అధికార టీడీపీ నేతలు భూములపై వాలిపోయి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై క్రైస్తవ భూములతో పాటు ప్రభుత్వ భూములు కూడా యథేచ్ఛగా దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
దర్శి పట్టణానికి చెందిన మాడపాకుల వెంకట సుబ్బయ్య భార్య సుబ్బాయమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. సుబ్బాయమ్మ మామ వెంకట సుబ్బయ్యకు సర్వే నంబర్ 178లో 2.35 ఎకరాల భూమి ఉంది. తమకు పూర్వీకుల ద్వారా సంక్రమించిన భూమిని తన భర్త వెంకట సుబ్బయ్యకు 1.17 ఎకరాల భూమి, ఆయన సోదరుడు వెంకటేశ్వర్లుకు 1.17 ఎకరాల భూమి ఉన్నట్టు రికార్డుల్లో ఉంది. ఇవి ఇనామ్ భూమి కావడంతో అమ్మడానికి లేదని ఫ్రీహోల్డ్‌లో పెట్టి ఉంది. 2025 జనవరి నెల వరకు ఈ భూమి ఫ్రీ హోల్డ్‌లోనే ఉంది. 2025 ఫిబ్రవరి నెలలో వెంకటేశ్వర్లుకు సంబంధించిన 1.17 ఎకరాల భూమి, వెంకట సుబ్బయ్యకు చెందిన సుమారు రూ.2 కోట్ల విలువైన 44 సెంట్లు భూమి కలిపి వెంకటేశ్వర్లు కొడుకుల పేరుపై ఎక్కించారని ఆమె ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఫ్రీ హోల్డ్ నుంచి తీసివేసి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అధికారులు వెసులుబాటు కల్పించారు.


