శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 – 8లో.. కమనీయం నేత్రపర్వం

మార్కాపురంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కల్యాణం శుక్రవారం వేకువజామున ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై కమనీయంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని తిలకించేందుకు తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం పోటెత్తింది. స్వామి వారి కల్యాణాన్ని కన్నులారా తిలకించిన భక్తులు భక్తితో పరవశించిపోయారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ అన్నా రాంబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

రంగనాయకా..పాహిమాం అంటూ భక్తజనం పులకించిపోయారు. రాచర్ల మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలోని కల్యాణ మండలంలో శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత నెమలిగుండ్ల రంగనాయకస్వామి కల్యాణం నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు.

– మార్కాపురం టౌన్‌

– రాచర్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement