బెట్టింగ్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి

Apr 1 2026 8:36 AM | Updated on Apr 1 2026 8:36 AM

ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

బేస్తవారిపేట/కంభం/రాచర్ల: ఐపీఎల్‌ నేపథ్యంలో బెట్టింగ్‌ను కట్టడి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్థన్‌రాజు పేర్కొన్నారు. మంగళవారం బేస్తవారిపేట, కంభం, గిద్దలూరు, కొమరోలు పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేయడంతోపాటు రాచర్ల మండలంలోని నెమలిగుండం రంగనాయకస్వామి క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భగా ఎస్పీ మాట్లాడుతూ.. బెట్టింగ్‌ రాకెట్‌ నిర్వహిస్తున్న ఆరుగురిని ఇటీవల అరెస్టు చేశామని, బెట్టింగ్‌ ఉచ్చులో చిక్కుకున్న యువకుల కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా వాహనాల తనిఖీలు విస్తృతంగా చేస్తున్నామన్నారు. బస్సుల్లో ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, కంభం సీఐ మల్లికార్జునరావు, గిద్దలూరు రూరల్‌ సీఐ జె.రామకోటయ్య, కంభం, బేస్తవారిపేట ఎస్సైలు శివకృష్ణరెడ్డి, రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాలకు

భారీ బందోబస్తు

రాచర్ల: నల్లమల అభయారణ్యంలోని నెమలిగుండం రంగనాయకస్వామి క్షేత్రంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వి.హర్షవర్థన్‌రాజు తెలిపారు. మంగళవారం రంగనాయకస్వామి దేవస్థానం పరిసర ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు. నీటి గుండం, వాహనాల పార్కింగ్‌, కల్యాణ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లపై స్థానిక పోలీసులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, దేవస్థానం చైర్మన్‌ నరసింహులు, ఈవో మల్లవరపు నాగయ్య, గిద్దలూరు రూరల్‌ సీఐ జే.రామకోటయ్య, రాచర్ల ఎస్సై పి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement